సైజ్ జీరో మీద రాజమౌళి చేయి

సైజ్ జీరో..మరో మూడు నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే అంతకన్నా ముందే టాప్ డైరక్టర్ రాజమౌళి దగ్గరకు వెళ్లిందట. సినిమా పూర్తిగా ఆర్ ఆర్ కూడా చేసాక రాజమౌళికి ప్రత్యేకంగా చూపించారని…

సైజ్ జీరో..మరో మూడు నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే అంతకన్నా ముందే టాప్ డైరక్టర్ రాజమౌళి దగ్గరకు వెళ్లిందట. సినిమా పూర్తిగా ఆర్ ఆర్ కూడా చేసాక రాజమౌళికి ప్రత్యేకంగా చూపించారని వినికిడి. ఆయన ఆద్యంతం చూసి, ఒకటికి రెండు సార్లు డిస్కషన్ చేసి, దాన్నిఓ షేప్ కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

జిమ్ లో చేరిన తరువాత..చేరక ముందు..అన్నట్లుగా..రాజమౌళి చేయి పడక ముందు..పడిన తరువాత అన్నట్లు సైజ్ జీరో చాలా మారిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. అన్న కీరవాణి నేపథ్య సంగీతం అందించడం,  గురువు రాఘవేంద్రరావు కుమారుడు దర్శకత్వం వహించడం వంటి కారణాలతో రాజమౌళి ఈ నగిషీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.