వైట్ల..అలా… వినాయక్ ఇలా

అఖిల్ సినిమా వ్యవహారం పైకి సమసిపోయినట్లు, సైలెంట్ గా అనిపిస్తున్నా, తెరవెనుక జరగాల్సినవి జరుగుతూనే వున్నాయి. ఈ సినిమా పరాజయానికి అన్నివేళ్లు వినాయక్ ను చూపిస్తున్నాయి. అయితే ఆయన తన నైతిక బాధ్యతతో అయిదుకోట్లు…

అఖిల్ సినిమా వ్యవహారం పైకి సమసిపోయినట్లు, సైలెంట్ గా అనిపిస్తున్నా, తెరవెనుక జరగాల్సినవి జరుగుతూనే వున్నాయి. ఈ సినిమా పరాజయానికి అన్నివేళ్లు వినాయక్ ను చూపిస్తున్నాయి. అయితే ఆయన తన నైతిక బాధ్యతతో అయిదుకోట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. తన రెమ్యూనిరేషన్ లో మూడు కోట్లు వదిలేసుకున్నాడట. 

అక్కడితో ఆగకుండా డిస్ట్రిబ్యూటర్లకు తన వంతు పరిహారం రెండుకోట్ల వరకు చెల్లిస్తా అని ముందుకు వచ్చాడట. అయితే ఈ రెండు కోట్లు వీలు వెంబడి తనకు కేటాయించిన డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తా అని నిర్మాత నితిన్ కు హామీ ఇచ్చాడట. ఇదిలా వుంటే ఈ విషయంలో శ్రీనువైట్ల కంటే వినాయక్ చాలా నయం అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. 

ఎందకుంటే ఆగడు అట్టర్ ఫ్లాప్ తరువాత డబ్బులు వెనక్కు ఇవ్వమంటే శ్రీనువైట్ల ససే మిరా అన్నాడు. పైగా విదల్చలేదని వినికిడి. ఆఖరికి బ్రూస్ లీ విడుదల సమయంలో నిర్మాత దానయ్య తప్పదు అని వత్తిడి చేసేసరికి, అతి కష్టం మీద యాభై లక్షలు వెనక్కు ఇచ్చాడు. అలాంటిది, ఎవరు అడగకుండానే వినాయక్ అయిదు కోట్లు వదులుకోవడం అంటే కాస్త మంచి విషయమే. అఖిల్ సినిమాకు వినాయక్ పది కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడని టాక్ వుంది. అంటే సగానికి సగం వదిలేస్తున్నట్లే.