మారుతి పందెం గెలుస్తాడా?

మారుతి టాకీస్ అని చెప్పి చిన్న సినిమాలను సమర్పిస్తున్నాడు దర్శకుడు దాసరి మారుతి. అయితే వాటిల్లో హిట్ లు వున్నాయి..ఫట్ లు వున్నాయి. ప్రేమకథాచిత్రమ్ లాంటి సంచలనాలు వున్నాయి. ఇప్పుడు అదే సంస్థ నుంచి…

మారుతి టాకీస్ అని చెప్పి చిన్న సినిమాలను సమర్పిస్తున్నాడు దర్శకుడు దాసరి మారుతి. అయితే వాటిల్లో హిట్ లు వున్నాయి..ఫట్ లు వున్నాయి. ప్రేమకథాచిత్రమ్ లాంటి సంచలనాలు వున్నాయి. ఇప్పుడు అదే సంస్థ నుంచి వస్తోంది కాయ్ రాజా కాయ్.  

ట్రయిలర్లు టీజర్లు చూస్తుంటే కాస్త వైవిధ్యంగానే వుండేటట్లు కనిపిస్తోంది. మారుతి స్కూలు నుంచి కాస్త విషయం వున్న మరో డైరక్టర్ వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ, సరైన స్లాట్ కోసం చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా కాంపిటీషన్ హెవీగానేవుంది. 

కానీ కాయ్ రాజా కాయ్ కు ఓ ప్లస్ పాయింట్ వుంది. అటు క్లాసూ కాదు, మాసూ కాదు. మీడియం యూత్ సినిమా. అందువల్ల ఏ మాత్రం టాక్ బాగున్నా జనాలకు చేరుతుంది. పైగా ఒక రోజు ముందుగా అంటే 23న విడుదల చేయడం కూడా కొంచెం పనికి వచ్చే అవకాశం వుంది. కాయ్ రాజా కాయ్  చిత్రాన్ని ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శివగణేష్‌ దర్శకత్వంలో రామ్‌ఖన్నా, మానస్‌, షామిలి, శ్రావ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.