Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'మాస్' దాహం తీరుతుందా?

'మాస్' దాహం తీరుతుందా?

2019 ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మాంచి మాస్ మసాలా సినిమా అది కూడా కాస్త పాపులర్ హీరోతో అన్నది రాలేదు. ఎఫ్ 2ను మాస్ సినిమా అనేకన్నా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనడం కరెక్ట్. అలాగే మహర్షి, మజిలీ కూడా ఫ్యామిలీ సినిమాలే. పక్కా యూత్ ఫుల్ మాస్ సినిమాలు రాలేదు ఇప్పటివరకు. ఇదిలావుంటే బాక్సాఫీస్ బాగా డల్ గా వుంది. ఫస్ట్ వీకెండ్ కాస్త హడావుడి చేయడం తప్ప, కుమ్మేసిన సినిమాలు మహర్షి తరువాత రాలేదు.

సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. పబ్లిసిటీ హడావుడి తప్ప, థియేటర్లకు కళ తెచ్చిన సినిమాలు కనిపించడం లేదు. ఇలాంటి టైమ్ లో వస్తున్నాయి రామ్ 'ఇస్మార్ట్ శంకర్', విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'. ఈ రెండు సినిమాల మీదే వుంది ఇండస్ట్రీ దృష్టి అంతా. పూరి జగన్నాధ్ కు మాస్ పల్స్ బాగా తెలుసు. కానీ ఆయనతో ఒకటే సమస్య. సినిమా కథ, కథనాల మీద సీరియస్ నెస్ కనిపించదు. తాపట్టిన కుందేటికి మూడేకాళ్లు అనే వ్యవహారంలో, తను అనుకున్నట్లు తీసుకుంటూ వెళ్లిపోతారు. సాయంత్రం పాయింట్ అనుకుని, తెల్లవారేసరికి కాస్టింగ్ డిసైడ్ చేసి, మధ్యాహ్నానికి సెట్ మీదకు వెళ్లి, మర్నాడు సినిమా రెడీ చేసే టైపు.

అలాంటి పూరి జగన్నాధ్ ఇది తనకు చివరి అవకాశం అని అనుకుంటూ, తీసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. బజ్ అయితే బాగానే క్రియేట్ అయింది. మాస్ దాహం ఫుల్ గా తీర్చేలా వుందని అనిపిస్తోంది విడుదలయిన రెండు ట్రయిలర్లు చూస్తుంటే. పూరి కథ, కథనాల విషయంలో కాస్త జాగ్రత్తగా వుంటే చాలు, సరైన సినిమా లేక అల్లల్లాడిపోతున్న మాస్ జనాలు నెత్తిన పెట్టేసుకుంటారు.

ఇదిలావుంటే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఓ వారం వెనుకగా 25న వస్తోంది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. విడుదలయిన ట్రయిలర్ చూస్తుంటే, విజయ్ సినిమాల్లో అతని ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ బాగానే ఇమిడ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ సినిమా బాగుండాలే కానీ, కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది. ఈ రెండు సినిమాలు ఆడితే, థియేటర్లు ఆగస్టు 15న సాహో వచ్చేవరకు కళకళలాడిపోతాయి.

కానీ ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. రామ్ - పూరికి ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడాలి. అప్పుడే సినిమా కనీసం సూపర్ హిట్ అనిపించుకుంటుంది. విజయ్ దేవరకొండకు అలా కాదు. యావరేజ్ అనిపించుకున్నా చాలు. సూపర్ హిట్ అయిపోతుంది. అతని క్రేజ్ అలా నడుస్తోంది ఇప్పుడు. చూడాలి రెండు సినిమాలు ఏం చేస్తాయో? ఏం సాధిస్తాయో?

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?