మే గోదాలోకి రావడం అవసరమా?

తొలి సినిమా రామయ్యా వస్తావయ్యా తో హిట్ కొట్టలేకపోయాడు కుర్ర హీరో నాగ్ అన్వేష్. సరే, కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ మరో సినిమా చేసాడు. ఏంజెల్ అంటూ జగదేకవీరుడు టైప్ ఫాంటసీ కథను…

తొలి సినిమా రామయ్యా వస్తావయ్యా తో హిట్ కొట్టలేకపోయాడు కుర్ర హీరో నాగ్ అన్వేష్. సరే, కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ మరో సినిమా చేసాడు. ఏంజెల్ అంటూ జగదేకవీరుడు టైప్ ఫాంటసీ కథను తీసుకుని కాస్త ఖర్చు చేసి మరీ సినిమా తీసారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు మే 19 విడుదల అంటూ ప్రకటించేసారు. 

మే నెల మామూలుగా లేదు. ఓ లెక్కలో వుంది. బాబు బాగా బిజీ, కేశవ, వైశాఖం, ఫ్యాషన్ డిజైనర్, రారండోయ్ వేడుకు చూద్దాం, రాధ, ఆరడుగుల బుల్లెట్, ఇలా చాలా సినిమాలే వున్నాయి. వీటి మధ్యలో ఈ బుడ్డోడు కూడా దూరడం అవసరమా? బాబు బాగా బిజీకి అవసరాల శ్రీనివాస్, కేశవ కు నిఖిల్-సుధీర్ కాంబినేషన్, ఫ్యాషన్ డిజైనర్ కు డైరక్టర్ వంశీ, వేడుక చూద్దాం కు నాగ్ చైతన్య, ఆరడుగుల బుల్లెట్ కు గోపీచంద్ ఇలా ఒక్కోసినిమాకు ఒక్కో పాజిటివ్ పాయింట్ వుంది.

మరి ఏంజెల్ కు వస్తే, మళ్లీ ఎల్ కే జీ నుంచి మొదలుపెట్టినట్లే నాగ్ అన్వేష్ కు. అలాంటపుడు జాగ్రత్తగా కాస్త అటు ఇటు చూసుకుని రావడం మానేసి, ఈ తొడతొక్కిడిలో దూరడం ఏలనో?