టీజర్ ఓకే.. రిలీజ్ డేట్ సంగతేంటి?

గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేసే నాని అప్పుడే మరో సినిమాను సిద్ధం చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా ఎంసీఏ. మరికొన్ని గంటల్లో ఈ…

గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేసే నాని అప్పుడే మరో సినిమాను సిద్ధం చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా ఎంసీఏ. మరికొన్ని గంటల్లో ఈ సినిమా టీజర్ విడుదలకానుంది. 

ఎంసీఏ ఫస్ట్ లుక్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు నాని. గళ్ల లుంగీ కట్టుకొని, చేతిలో పాల ప్యాకెట్లు పట్టుకొని చిరునవ్వు చిందిస్తూ రోడ్డుపై నడిచే స్టిల్ అది. అందరికీ ఆ స్టిల్ బాగా నచ్చింది. ఇప్పుడు టీజర్ తో మరికొన్ని ఆసక్తికర అంశాల్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. 

టీజర్ ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే.. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. అఖిల్ నటిస్తున్న హలో, ఎంసీఏ సినిమాలు రెండూ ఒక రోజు గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి.

పోటీ లేకుండా ఉండేందుకు ఎంసీఏం సినిమాను చెప్పిన టైమ్ కంటే వారం రోజుల ముందే థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సంగతేంటో టీజర్ రిలీజ్ తో తేలిపోతుందని అంతా వెయిట్ చేస్తున్నారు.