ఎంసిఎ తో భాగమతి

హలో సినిమాతో రాజ్ తరుణ్ రంగులరాట్నం ట్రయిలర్ థియేటర్లలోకి వెళ్తున్న వార్త తెలిసిందే. అవి రెండూ అన్నపూర్ణ బ్యానర్ సినిమాలే కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి ప్లానింగ్ నే మరో సినిమా విషయంలో…

హలో సినిమాతో రాజ్ తరుణ్ రంగులరాట్నం ట్రయిలర్ థియేటర్లలోకి వెళ్తున్న వార్త తెలిసిందే. అవి రెండూ అన్నపూర్ణ బ్యానర్ సినిమాలే కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి ప్లానింగ్ నే మరో సినిమా విషయంలో కూడా చేస్తున్నారు.

అనుష్క ప్రధానపాత్రలో నటించిన భాగమతి సినిమా టీజర్ నాని ఎంసిఎ సినిమాతో థియేటర్లలోకి వస్తోంది. ఎంసిఎ నిర్మాత దిల్ రాజుతో, భాగమతి నిర్మాతలు యువి క్రియేషన్స్ కు వ్యాపార బంధాలు వున్నాయి. అందకు ఆ సినిమాతో ఈ టీజర్ జత చేస్తున్నారు. 

యువి క్రియేషన్స్ నిర్మించిన భాగమతి సినిమా మీద కాస్త మంచి అంచనాలే వున్నాయి. గ్రాఫిక్స్ తో కూడిన హర్రర్ జోనర్ సినిమా కావడం, బాహుబలి తరువాత అనుష్క నటించిన సినిమా ఇదే కావడం వంటి కారణాలతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ సూర్య సినిమా గ్యాంగ్ వుండడంతో భాగమతిని జనవరి 26కు వాయిదా వేసారు. ఈ సినిమా కోసం కాస్త భారీగానే ఖర్చు చేసారు. అన్నపూర్ణ స్టూడియోలో ఓ రియలిస్టిక్ భారీ సెట్ కూడా వేసారు.