ముందుగా శ్రుతి హరిహరన్ మొదలుపెట్టగా.. ఇప్పుడు నటుడు అర్జున్ మీద మరింత మంది మంట రేపుతున్నారు. ఈ విషయంలో మేల్ సెలబ్రిటీలు కూడా యాంకరింగ్ మొదలుపెట్టడం విశేషం. ప్రత్యేకించి నటుడు ప్రకాష్ రాజ్ ఈ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక కన్నడ నటుడిగా అర్జున్ గొప్పవాడే అని, వెటరన్, ప్రైడ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ అని.. చెప్పిన ప్రకాష్ రాజ్ ఇదే సమయంలో శ్రుతి హరిహరన్ మాటలనూ కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. ఆమె వేధింపులను ఎదుర్కొన్నట్టే అని ఈ నటుడు అంటున్నాడు. దీనికి గానూ అర్జున్ క్షమాపణలు చెప్పేస్తే సరిపోతుందని ప్రకాష్ రాజ్ తేల్చేశాడు.
ఇక అలాగే పలువురు కన్నడీగులు కూడా శ్రుతి హరిహరన్ కు మద్దతు పలికారు. ఇంకా చోటామోటా నటీమణులు కూడా శ్రుతికి అండగా నిలబడుతున్నారు. అయితే నటి సోనీ చరిష్టా మాత్రం శ్రుతి తీరును తప్పు పట్టింది. అర్జున్ సిసలైన జెంటిల్మాన్ అని ఆమె తేల్చేసింది. తను అర్జున్ తో కలిసి పని చేశానని ఆ అనుభవంతో చెబుతున్నాను అని వ్యాఖ్యానించింది.
కొంతమందేమో. .అర్జున్ ను జెంటిల్మన్ అంటూ పిలవడం ఆపాలని అంటుండగా, మరికొందరు అతడు జెంటిల్మన్ అని అంటున్నారు. మరోవైపు అర్జున్ మాత్రం ఆమెవి తప్పుడు ఆరోపణలు అంటున్నాడు. లీగల్ నోటీసులు అని చెబుతున్నాడు.
నిబునన్ సినిమా షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ రెచ్చిపోయాడని, తనను తడిమాడని, ఇలాగే ఫోర్ ప్లే చేద్దామా డైరెక్టర్.. అంటూ దర్శకుడి వైపు కేసి చూస్తూ అన్నాడని శ్రుతి హరిహరన్ అంటోంది. అయితే ఆ సినిమా దర్శకుడు కూడా అర్జున్ అలాంటి వాడు కాదని అంటున్నాడు.