హీరోయిన్ల ఆరోపణలకు హద్దు లేకుండా పోతున్నట్టుగా ఉంది. ఒక్కోరు ఒక్కో రకంగా మీ టూ అంటున్నారు. తమను ఫలానా హీరో, ఫలానా దర్శకుడు వేధించాడని ఆరోపణలు చేయడంతో మొదలు.. షూటింగ్ స్పాట్లో రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల విషయంలో కూడా వీళ్లు మీ టూ అంటున్నారు. నటి శ్రుతి హరిహరన్ అర్జున్ పై చేస్తున్న ఆరోపణలు రొమాంటిక్ సీన్లో నటించడానికి సంబంధించనవే. ఆ సమయంలో అర్జున్ అతి చేశాడని ఆమె అంటోంది.
అయితే ఆఫ్ లైన్లో వేధిస్తే దాన్ని తప్పు పట్టవచ్చు కానీ.. చిత్రీకరణ సమయంలో అలా జరిగింది.. అంటే అక్కడ వేధింపు అనేదానికి కొలబద్ధ ఉండదు. శ్రుతి చేసిన ఆరోపణల సంగతలా ఉంటే.. నటి సంజనా (బుజ్జిగాడులో త్రిష చెల్లెలు) మరింత విడ్డూరమైన ఆరోపణ చేసింది. ఈమె ఏమంటోందంటే.. తనను బెదిరించి కొన్ని సీన్లు చిత్రీకరించారని ఈమె వాపోతోంది.
ఇదొక కన్నడ సినిమాకు సంబంధించిన వ్యవహారం. హిందీలో సూపర్ హిట్ అయిన మర్డర్ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి తనను హీరోయిన్ గా ఎంచుకున్నారని, ఆ సినిమాలో తనను బలవంతపెట్టి హాట్ సీన్లలో నటింపజేశారని ఈమె అంటోంది. బ్యాంకాక్ బీచ్ లలో తనతో విపరీత స్థాయిలో ఎక్స్ పోజింగ్ చేయించి హాట్ సాంగ్స్ తీశారని అంటోంది. ఆ సీన్లలో నటించడానికి తను ఒప్పుకోలేదని.. అయితే ఆ సినిమా రూపకర్తలు బెదిరించారని, కెరీర్ నాశనం అవుతుందని అన్నారని.. అలా బలవంతంగా షూట్ చేశారని ఈమె అంటోంది.
ఇది చాలా విడ్డూరమైన ఆరోపణే అని చెప్పకతప్పదు. ఎందుకంటే.. సంజన ఆ సీన్లలో నటించింది నిజం. ఆమెకు నచ్చనట్టు అయితే బలవంతం చేసినా ఎలా ఒప్పుకుంటుంది? ఆ సినిమా నుంచి తప్పుకోవచ్చు కదా. అందునా ‘మర్డర్’ సినిమాకు సదరు కన్నడ సినిమా రీమేక్. అంటే సంజన ఆల్రెడీ మర్డర్ సినిమా చూసి ఉంటుంది. ఆ సినిమాలో మల్లికా షెరావత్ ఎలా రెచ్చిపోయిందో చూసే ఉంటుంది.
అప్పట్లో అత్యంత హాట్ సినిమాగా సంచలనం మర్డర్. అలాంటి సినిమాను రీమేక్ చేస్తున్నామని అన్నప్పుడే తను ఎలా నటించాల్సి ఉంటుందో సంజన అర్థం చేసుకుని ఉండాలి. అబ్బే.. మార్పులు చేస్తామన్నారు, చేయలేదు.. అని ఇప్పుడు వాపోతే? మరి ఇలాగైతే.. అవకాశం కోసం అప్పుడు విపరీత స్థాయిలో ఎక్స్ పోజింగ్ చేసిన వాళ్లంతా.. తమ చేత బలవంతంగా అలా చేయించారని ఫిర్యాదులు చేయడం మొదలైతే.. ఆ కేసుల పరిష్కారానికి ఎన్ని కోర్టులు కావాలి?