రానాకు కలిసొచ్చిన మీ-టూ ఉద్యమం

బాలీవుడ్ లో మీటూ వ్యవహారంతో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల దాకా, నటుల నుంచి టెక్నీషియన్ల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు బాధితులు. ఇప్పుడీ మీ-టూ ఉద్యమం హీరో…

బాలీవుడ్ లో మీటూ వ్యవహారంతో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల దాకా, నటుల నుంచి టెక్నీషియన్ల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు బాధితులు. ఇప్పుడీ మీ-టూ ఉద్యమం హీరో రానాకు మరో విధంగా కలిసొచ్చింది.

అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హౌస్ ఫుల్-4 సినిమాలో మీటూ బౌన్సర్ కు రెండు వికెట్లు పడ్డాయి. ఒకరు నటుడు నానా పటేకర్ కాగా, రెండో వ్యక్తి దర్శకుడు సాజిద్ ఖాన్. ఇప్పుడు వీరికి ప్రత్యామ్నాయం వెదికే పనిలోపడ్డారు నిర్మాతలు. దర్శకుడిగా ఆల్మోస్ట్ ఫర్హాద్ సామ్ పేరు ఖరారైంది. ఇక నానా పటేకర్ ని ఎవరితో రీప్లేస్ చేద్దామా అని ఆలోచిస్తున్న నిర్మాతలకు రానా పేరు తట్టింది.

ఇప్పటికే బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న రానాకు ఇది మంచి అవకాశం. అక్షయ్ కుమార్ వంటి బడా హీరోతో కలసి నటించే ఛాన్స్, అందులోనూ సక్సెస్ ఫుల్ సిరీస్… ఇంకేముంది రానా కూడా సంతోషంగా ఓకే చెప్పేశాడు. వచ్చేవారం నుంచి రానా షూటింగ్ కి హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే అధికారికంగా దీనిపై నిర్మాతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మరోవైపు జోరుగా ప్రారంభమైన మీటూ ఉద్యమం ప్రస్తుతం పలుచబడినట్టు కనిపిస్తోంది. బాధితులకు బాసటగా నిలిచేవారితో పాటు వారిని వ్యతిరేకించే వర్గం కూడా తయారైంది. గతంలో తమపై జరిగిన అఘాయిత్యాలను, అకృత్యాలను బయటపెట్టడం వరకు ఓకే.. కాకపోతే దీన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు.

ఇటీవల కేరళ సోలార్ స్కామ్ కి కూడా మీటూ కోటింగ్ ఇచ్చి రాజకీయ కక్ష సాధింపులకు వాడుకున్నారు. అటు చిన్నా చితకా ఆర్టిస్ట్ లు కూడా కొంతమంది దర్శక నిర్మాతలను మీటూ పేరుతో బెదిరిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

మహిళలు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బైటపెట్టడం మంచిదే కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. అసలు కాలకముందే ఆ పనిచేస్తే మంచిదేమో అని చాలామంది సలహాలిస్తున్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి