మీడియా మేనేజ్ మెంట్ కేరాఫ్ చార్మి

ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాలకు బజ్ తీసుకురావడం, పబ్లిసిటీ చేయడం, సోషల్ మీడియా మేనేజ్ మెంట్ ఇలాంటివి అన్నీ మహిళా లోకం చూసుకోవడం ఎక్కువగా మారుతోంది. రామ్ చరణ్ విషయంలో ఇలాంటివి కొంత…

ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాలకు బజ్ తీసుకురావడం, పబ్లిసిటీ చేయడం, సోషల్ మీడియా మేనేజ్ మెంట్ ఇలాంటివి అన్నీ మహిళా లోకం చూసుకోవడం ఎక్కువగా మారుతోంది. రామ్ చరణ్ విషయంలో ఇలాంటివి కొంత వరకు ఉపాసన చూస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వరకు. ఇక మహేష్ శ్రీమతి నమ్రత అయితే అన్నీ తానై పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతోంది? ఏం వార్తలు వస్తున్నాయి? ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు? ఇలా అన్నీ ఆమే చూసుకుంటారు. 

ఇప్పుడు చార్మి కౌర్ కూడా పూరి బ్యానర్ కు ఇలాగే కీలకంగా వున్నారు. పూరి కనెక్ట్స్ సంస్థకు ఆమె సిఇఓ. అందులో భాగంగా మీడియా వ్యవహారాలను ఆమె చాలా సీరియస్ గా చూస్తున్నారని తెలుస్తోంది. నేరుగా మీడియా జనాలకు ఆమే ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నట్లు వినికిడి. 
మెహబూబా అన్నది పూరి జగన్నాధ్ కు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఎందరో హీరోలకు హిట్ లు ఇచ్చిన పూరి ఇప్పుడు డౌన్ ఫాల్ లో వున్నారు.

అలాంటి టైమ్ లో ఆయన తన కొడుకు ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కొడుకు కెరీర్ కొసం, తన కెరీర్ కోసం, పైగా స్వంత నిర్మాణం కావడం వల్ల, పూరి కనెక్ట్స్ సంస్థ కోసం కచ్చితంగా హిట్ కొట్టాల్సి వుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా నుంచి అంతా పాజిటివ్ గా వుండాలని చార్మి కాస్త 'గట్టిగా' కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.