ఆ హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి?

ఓవైపు వరుస సినిమాలతో మీనాక్షి చౌదరి బిజీగా ఉంటుంటే, మరోవైపు ఆమెపై అదే స్థాయిలో పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు కాదు, 2 రోజుల నుంచి నడుస్తున్న అతిపెద్ద రూమర్ ఇది. మేటర్ ఏంటంటే, ఈ…

ఓవైపు వరుస సినిమాలతో మీనాక్షి చౌదరి బిజీగా ఉంటుంటే, మరోవైపు ఆమెపై అదే స్థాయిలో పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు కాదు, 2 రోజుల నుంచి నడుస్తున్న అతిపెద్ద రూమర్ ఇది. మేటర్ ఏంటంటే, ఈ ముద్దుగుమ్మ, హీరో సుశాంత్ తో ప్రేమలో పడిందట. త్వరలోనే అతడ్ని పెళ్లి చేసుకోబోతోందనేది దీని సారాంశం.

2 రోజులుగా నలుగుతున్న ఈ పుకారుపై మీనాక్షి చౌదరి టీమ్ క్లారిటీ ఇచ్చింది. సుశాంత్-మీనాక్షి మంచి స్నేహితులంట. అంతవరకు మాత్రమే వాళ్ల బంధాన్ని చూడాలని కోరుతోంది. అయితే దీనిపై మీనాక్షి స్పందించలేదు. ఆమెకు అంత తీరిక లేదిప్పుడు.

2 నెలలుగా మీనాక్షి నుంచి వరుసపెట్టి సినిమాలు వస్తూనే ఉన్నాయి. గోట్, లక్కీ భాస్కర్, మట్కా.. ఇలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మెకానిక్ రాకీ వస్తోంది, పండక్కి “సంక్రాంతికి వస్తున్నాం” అనే సినిమా కూడా లైన్లో ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలపైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది.

మీనాక్షి చౌదరి తొలి తెలుగు హీరో సుశాంత్. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమాతో మీనాక్షిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు సుశాంత్. అప్పట్నుంచి వీళ్లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారనేది నిజం. వీళ్లు డేటింగ్ లో ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. వీళ్లు మాత్రం తరచుగా కలుస్తుంటారు.

2 Replies to “ఆ హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి?”

Comments are closed.