కుబేర.. డబ్బు చుట్టూ ఎమోషన్లు

శేఖర్ కమ్ముల అంటే సాదా సీదా దర్శకుడు కాదు. తెర మీదకు భావోద్వేగాలు తేవడంలో దిట్ట. అలాంటి దర్శకుడు డబ్బు చుట్టూ తిరిగే ఓ ధ్రిల్లర్ కథను తెరకెక్కిస్తున్నాడు అంటే కచ్చితంగా సమ్ థింగ్…

శేఖర్ కమ్ముల అంటే సాదా సీదా దర్శకుడు కాదు. తెర మీదకు భావోద్వేగాలు తేవడంలో దిట్ట. అలాంటి దర్శకుడు డబ్బు చుట్టూ తిరిగే ఓ ధ్రిల్లర్ కథను తెరకెక్కిస్తున్నాడు అంటే కచ్చితంగా సమ్ థింగ్ అనుకోవాల్సిందే. ఈ రోజు విడుదలైన కుబేర గ్లింప్స్ కూడా ఆ విషయం మీదనే క్లారిటీ ఇచ్చింది. సినిమాలో వున్న నటులు, వారి డిఫెరెంట్ సిట్యువేషన్లు ప్రెజెంట్ చేస్తూ, ఒక్క డైలాగు కూడా లేని గ్లింప్స్ ను అందించారు.

నాగ్, ధనుష్, రష్మికతో పాటు ఇతర కీలక నటులు అంతా గ్లింప్స్ లో కనిపించారు. అయితే జస్ట్ కనిపించడం కాదు. రకరకాల భావోద్వేగాలు వాళ్ల ముఖాల్లో కనిపించేలా. టోటల్ గ్లింప్స్ కు హైలైట్ ఏమిటంటే దేవీశ్రీప్రసాద్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్. గ్లింప్స్ లో డైలాగులు లేని లోటు కనిపించకుండా చేసాడు.

కథ ఏమిటి.. లైన్.. లెంగ్త్ ఏమిటి అన్నది చెప్పే గ్లింప్స్ కాదు. మనుషులు.. డబ్బు.. వీటి చుట్టూ వుండే భావోద్వేగాలను ఒడిసి పట్టే సినిమా ఇది అని చెప్పే గ్లింప్స్.

కుబేర సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది. అది మార్చి నుంచి మే మధ్యలో ఎప్పుడైనా కావచ్చు. కానీ శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎదురు చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడూ వుంటారు. ఈ సినిమాకు నిర్మాత సునీల్ నారంగ్.

4 Replies to “కుబేర.. డబ్బు చుట్టూ ఎమోషన్లు”

  1. ఓ రెడ్డిగారుండేవారు దర్శకుడుగా…ఈ మధ్య కాస్త వెరైటీగా ఓ సినిమా తీసి కనుమరువైపోయినట్టుగా ఈ శేఖర్ కూడా అంతే..

Comments are closed.