ప్రత్యేకహోదా పోరును వైకాపా స్టార్ట్ చేసినపుడు తెలుగుదేశం పార్టీ ఇంకా భాజపా పొత్తు మత్తులో వుండేది. అప్పుట్లో వైకాపా లోకల్ పోరు తేదేపాకు కిట్టేదికాదు. అందువల్ల, కౌంటర్ గా ఎప్పడూ ఒకటే డైలాగు చెబుతుండేది. హోదా రావాల్సింది ఢిల్లీ నుంచి అందువల్ల వైకాపా జనాలు ఢిల్లీ వీధుల్లో పోరాడాలి కానీ, ఇక్కడ కాదు అంటూ కౌంటర్ వేస్తుండేవారు.
కట్ చేస్తే, భాజపాతో పొత్తును విడగొట్టకుని, గత మూడున్నరేళ్ల పాపాలను ఆ పార్టీ ఖాతాలోకి తోసేసి, పవిత్రంగా జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తొంది తేదేపా. అందువల్ల తెగ యాగీ చేస్తోంది. ప్రభుత్వం సొమ్ము కోట్లకు కోట్లు ఖర్చుచేసి, దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే నిన్నటికి నిన్న అవిశ్వాస వ్యవహారం ముగియగానే, ఆంధ్రలో నిరసనలకు పిలుపునిచ్చింది. కొన్నిచోట్ల కాగడాల ప్రదర్శన చేసారు.
మరి అప్పుడు వైకాపాకు ఢిల్లీ వెళ్లి పోరాడండి, ఆంధ్రలో కాదు అని చెప్పిన సుద్దులను తెలుగుదేశం పార్టీ మరిచిపోయింది. గుర్తు చేయడాన్ని ఆ పార్టీ సెక్యూరిటీ సపోర్టుగా నిలబడిన మీడియా కూడా మరిచిపోయింది. దీన్నే అంటారు. కోడలికి నీతులు చెప్పి, అత్త దుత్త నాకింది అని గ్రామాల్లో.