విజేత సినిమాతో తెరంగ్రేటం చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్. కానీ పాపం, అతగాడి ఆశ నిరాశ అయింది. నిర్మాత సాయి కొర్రపాటికి ఓ పదికోట్లు లాస్ అయింది. తరువాత ఇప్పటి దాకా సైలంట్ అయిపోయిన కళ్యాణ్ థేవ్ మరో సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోడబోతున్నాడు.
ఆ మధ్య నాటకం అనే చిన్న సినిమాను అందించిన రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రెండో ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతోంది. ఈ సినిమాకు హీరోగా కళ్యాణ్ ధేవ్ ను తీసుకున్నారు. పులివాసు దర్శకుడు.
జోనర్, కథ, కమామిషు, హీరోయిన్ వగైరా వ్యవహారాలన్నీ ఇంకా డిసైడ్ చేయాల్సి వుంది. మ్యూజిక్ డైరక్టర్ గా మాత్రం థమన్ ను ఫిక్స్ చేసేసుకున్నారు. త్వరలో అన్నీ డిసైడ్ చేసుకుని, సెట్ మీదకు వెళ్తుందీ సినిమా.
తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్