విక్రమ్ కుమార్ పంచాయతీ

ఇస్తున్నారు కదా అని దొరికిన అడ్వాన్స్ లు అన్నీ తీసుకుంటే, ఏదో ఒక పాయింట్ లో కిందామీదా అయిపోవాల్సి వస్తుంది. డైరక్టర్ విక్రమ్ కె కుమార్ పరిస్థితి అలాగే వుంది. అశ్వనీదత్, మంజుల ఘట్టమనేని…

ఇస్తున్నారు కదా అని దొరికిన అడ్వాన్స్ లు అన్నీ తీసుకుంటే, ఏదో ఒక పాయింట్ లో కిందామీదా అయిపోవాల్సి వస్తుంది. డైరక్టర్ విక్రమ్ కె కుమార్ పరిస్థితి అలాగే వుంది. అశ్వనీదత్, మంజుల ఘట్టమనేని ఇలా ఇంకా మరో రెండు మూడు అడ్వాన్స్ లు తీసుకున్నాడు. ఇప్పుడు సరైన ప్రాజెక్టు సెట్ కావడంలేదు. పైగా ఈ బ్యానర్లకే చేయాల్సి రావడం.

లేటెస్ట్ గా నానితో ఓ సినిమా ఓకె అయింది. కానీ నానికి వున్న కమిట్ మెంట్ల వల్ల వేరే బ్యానర్ కు చేయాలి. దాంతో విక్రమ్ కుమార్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిన్నటికి నిన్న అశ్వనీదత్ దగ్గర చాలాసేపు పంచాయతీ  జరిగింది. ఆఖరికి, ఏ బ్యానర్ లో సినిమా చేసుకున్నా, అశ్వనీదత్ కు రాయల్టీ ఇచ్చేలాగనో, మరో విధంగానో, మొత్తానికి సెటిల్ మెంట్ కుదిరినట్లు తెలుస్తోంది.

మరి ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే, మంజుల ఘట్టమనేని ఏమంటారో? తనకు కూడా ఇవ్వాల్సిందే అంటే, పాపం, విక్రమ్ కుమార్ కు వచ్చే రెమ్యూనిరేషన్ ఎంత? మిగిలేది ఎంత? మంచి డైరక్టర్, వైవిధ్యమైన సినిమాలు తీస్తారు అన్న పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్, సరైన బడ్జెట్ ప్లానింగ్, కమర్షియల్ అవుట్ పుట్ లేక, ఇలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. 

తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్