రంజిత్ మూవీస్ అన్నది చాలా ఓల్డ్ బ్యానర్. వారసత్వంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ కు వచ్చింది. ఆయన చాలా పద్దతిగా మంచి చిన్న సినిమాలు నిర్మించారు. అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, అంతకు ముందు ఆ తరవాత లాంటి మంచి సినిమాలు అందించారు. కానీ కమర్షియల్ గా కాస్త కిందామీదా కావాల్సి వచ్చింది.
దాంతో ప్రొడక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు. కొత్త డైరక్టర్లతో, కొత్త తరహా స్క్రిప్ట్ లతో ఏడాది పాటు కుస్తీ పట్టి, ఆఖరికి మూడు ప్రాజెక్టులు ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు వరుసగా మూడు ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
వీటిల్లో ఒక ప్రాజెక్టును జనవరిలో కొత్త దర్శకుడు సాగర్ తో స్టార్ట్ చేస్తారట. మరో రెండు కూడా వెంట వెంటనే సమాంతరంగా స్టార్ట్ చేస్తారట. చిన్న సినిమాలు బాగుంటే, మంచి వసూళ్లే వస్తున్నాయి. సేఫ్ అవుతున్నాయి.
అందుకే దామూ ఈ బాట పట్టి వుంటారు. కానీ కాస్తయినా డైరక్టర్ వాల్యూ, స్టార్ వాల్యూ యాడ్ అవ్వాలి. బ్యానర్ ఒక్కటీ వుంటే చాలదు.
తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్