Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా ఫ్యామిలీ మాదిరిగానే..

మెగా ఫ్యామిలీ మాదిరిగానే..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే వుంటారు. దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ నుంచి కూడా సినిమా రంగంలోకి జనాలు వస్తూనే వుంటారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, వారి వారి తండ్రులు, కుటుంబ సభ్యుల రకరకాలుగా సినిమారంగంలో వున్నారు. అయితే వీరంతా హీరోలుగా కాకుండా వివిధ రంగాల్లో పని చేస్తుండడం విశేషం. కీరవాణి తనయుడు కాలభైరవ కూడా గాయకుడిగా రంగప్రవేశం చేసారు. అలాగే మత్తువదలరా సినిమాతో సంగీత దర్శకుడు అవుతున్నారు.

అదే సినిమాతో కీరవాణి మరో తనయుడు సింహ హీరోగా పరిచయం అవుతున్నారు. కోటి నుంచి కోటిన్నర చిన్న బడ్జెట్ తో తయారయ్యే ఈ సినిమాను మైత్రీ మూవీస్ బ్యాకెండ్ లో వుండి నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీస్ సిఇఒ చెర్రీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.

ఇదిలావుంటే రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా నిర్మాతగా మారి ఆకాశవాణి అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా కీరవాణి తనయుడు కాలభైరవనే సంగీతం అందిస్తున్నారు.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?