ఈ రోజుల్లో సినిమా జనాలకు హెయిర్ ప్లాంటేషన్ అన్నది ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అవసరంగా మారిపోయింది. ఇప్పటికే సినిమా డైరక్టర్లు, నిర్మాతలు చాలా మంది విగ్ లు వాడుతున్నారు. ఈ విగ్ లతో చాలా తలకాయనొప్పులు వున్నాయి. అందుకే హెయిర్ వీవింగ్ కు రెడీ అవుతున్నారు. ఇటీవలే వివి వినాయక్, బండ్ల గణేష్ లాంటి వారు హెయిర్ వీవింగ్ చేయించుకున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే ఓ టాప్ డైరక్టర్ కూడా వీవింగ్ చేయించుకున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే బాట పట్టారని తెలుస్తొంది. ఈ మధ్యనే ఆయన హెయిర్ వీవింగ్ చేయించుకున్నారని బోగట్టా. అందుకే ఈ మధ్య తరచు టోపీతో కనిపిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకప్పుడు హెయిర్ వీవింగ్ అంటే రియాక్షన్ లాంటి భయాలు వుండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. లోకల్ గానే లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ కు తెలిసిన, నమ్మకమైన సంస్థ గురించి రామ్ చరణ్ విచారించి సిఫార్సు చేస్తే, మెగాస్టార్ చేయించుకున్నారని బోగట్టా. అయితే ఇది జరిగి నెలకు పైగా అయినట్లు తెలుస్తోంది
దాంతో సినిమా జనాలు అంతా ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఇంకా సంపాదించాలంటే తలపై ముందు ఎకరాలు పోకుండా వుండాలన్నది కీలకంగా మారింది. అందుకే చాలా మంది హెయిర్ వీవింగ్ బాట పడుతున్నారు.