ఎప్పటి నుంచో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఒకటి వుంది. రానా దగ్గుబాటి-విక్టరీ వెంకటేష్ కలిసి చేయబోయే సినిమా అది.
ఇప్పటి వరకు ఆ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ అయిందట. ఈ విషయాన్ని రానా నే స్వయంగా వెల్లడించాడు.
ఈ కరోనా హడావుడి అంతా ముగిసిన తరువాత వెంకీ-రానా సినిమా ప్రకటన వస్తుందట. ఈ సినిమాను సురేష్ బ్యానర్ మీదే వుంటుదని చెప్పారు. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ కావాలని అడుగుతున్నారని ఇప్పుడు కరోనా కారణంగా టైమ్ వచ్చిందని అన్నారు.
గతంలో కథలు వినడానికి టైమ్ దొరికేది కాదని, ఇప్పుడు కరోనా కారణంగా టైమ్ దొరికిందని అలా దొరికిన కథల్లో బాబాయ్-అబ్బాయ్ ల కథ ఒకటి అని అన్నారు.
ఆ కథను పాలిష్ చేసి, అంతా రెడీ చేసామని చెప్పారు. అయితే ఈ కథ ఎవరు చెప్పారు? డైరక్టర్ ఎవరు? అన్నది రానా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.
త్వరలో తమ పిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్ధులు తయారుచేసే రెండు షార్ట్ ఫిలిమ్స్ లో తాను నటిస్తున్నా అని రానా వెల్లడించడం విశేషం.