మెగా హీరోకి అంత సాఫ్ట్ టైటిలా??

చిరంజీవి నుంచి సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌ర‌కూ మెగా హీరోలంతా మాస్‌ని టార్గెట్ చేసిన వాళ్లే. మాస్ మెచ్చే క‌థ‌ల్నీ టైటిళ్లనీ ఎంచుకొని… మాస్ హీరోలుగా ఎదిగారు. అలాంటి హీరోల‌కు సాఫ్ట్ టైటిల్ పెట్టడం నిజంగా…

చిరంజీవి నుంచి సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌ర‌కూ మెగా హీరోలంతా మాస్‌ని టార్గెట్ చేసిన వాళ్లే. మాస్ మెచ్చే క‌థ‌ల్నీ టైటిళ్లనీ ఎంచుకొని… మాస్ హీరోలుగా ఎదిగారు. అలాంటి హీరోల‌కు సాఫ్ట్ టైటిల్ పెట్టడం నిజంగా సాహ‌సంలాంటిదే. అలాంటి సాహ‌సానికి పూనుకొన్నాడు దిల్‌రాజు. 

ఆయ‌న‌కీ మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కీ మంచి సింక్ కుదిరింది. అందుకే సాయిధ‌ర‌మ్ తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫ‌ర్ సేల్ త‌ర‌వాత‌… సాయితో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు దిల్‌రాజు. ఈ చిత్రానికి శ‌త‌మానం భ‌వ‌తి అనే టైటిల్ ఖారారుచేశార‌ట‌. 

కొత్త ద‌ర్శకుడు, ఓ కొత్త హీరోయిన్‌తో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కిస్తాడ‌ని వినికిడి. మెగా హీరోకి మ‌రీ ఇంత సాఫ్ట్ టైటిల్ ఏంటో మ‌రి. క‌థ డిమాండ్ చేసుకొంటుంది. మొత్తానికి మెగా హీరోతో ప్రయోగాల‌కు పూనుకొన్నాడు దిల్ రాజు. మరి అంతా అయ్యాక మారుస్తారో?