బాహుబ‌లి ఆడియో.. తిరుప‌తిలో

బాహుబ‌లి ఆడియో వేడుక‌, తేదీ మ‌ళ్లీ మారాయి. మే 31న హైద‌రాబాద్‌లో గ్రాండ్ ఈ ఫంక్షన్ చేద్దామ‌నుకొన్నారు. కానీ కుద‌ర్లేదు. ఈనెల 10 హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో విడుద‌ల కార్యక్రమం చేద్దామ‌నుకొన్నారు. అక్కడ…

బాహుబ‌లి ఆడియో వేడుక‌, తేదీ మ‌ళ్లీ మారాయి. మే 31న హైద‌రాబాద్‌లో గ్రాండ్ ఈ ఫంక్షన్ చేద్దామ‌నుకొన్నారు. కానీ కుద‌ర్లేదు. ఈనెల 10 హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో విడుద‌ల కార్యక్రమం చేద్దామ‌నుకొన్నారు. అక్కడ ఏర్పాట్లూ దాదాపుగా పూర్తి కావ‌చ్చాయి. 

కానీ.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ ఆలోచ‌న నుంచి విర‌మించుకొన్నారు. తాజా స‌మాచారం ప్రకారం ఈనెల 13న తిరుప‌తిలో ఆడియో ని రిలీజ్ చేద్దామ‌నుకొంటున్నారు.  ఆత‌ర‌వాత హైద‌రాబాద్‌, విశాఖ‌, విజ‌య‌వాడ త‌దిత‌ర ప్రాంతాల్లో కూడా బాహుబ‌లి ప్రమోష‌న్ కార్యక్రమాల్ని వినూత్నంగా నిర్వహిస్తార‌ని స‌మాచారం. 

మ‌రి ఈసారైనా తిరుప‌తి ఫిక్సో.. లేదంటో మ‌ళ్లీ ఇందులో మార్పులేమైనా ఉంటాయో.. రాజ‌మౌళికే తెలియాలి.