సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్ విజయాలున్నాయి దశరథ్ ఖాతాలో. కానీ మధ్యలో వచ్చిన సినిమాల్నీ ఫట్టే. ఈయేడాది వచ్చిన గ్రీకు వీరుడు కూడా నిరాశ పరిచింది. దశరథ్ కెరీర్ డైలామాలో పడిన ఈ తరుణంలో ఇప్పుడు ఓ మెగా ఛాన్స్ వచ్చింది.
దశరథ్ త్వరలోనే మెగా హీరోతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైంది. అలా మొదలైంది నిర్మాత దామోదర ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. అయితే ఈ హీరో ఎవరనేది సస్పెన్స్. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లలో ఒకరితో సినిమా చేయడం ఖాయమని సమాచారమ్.
ఇది కూడా దశరథ్ శైలిలో సాగే సినిమానట. క్లాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సాగే సినిమా అట. త్వరలోనే ఆ హీరో ఎవరనే విషయం తెలుస్తుంది. మరి దశరథ్ ఈసారైనా హిట్ కొడతాడా..? పెద్ద హీరోలని డీల్ చేయగలడా..? చూడాలి మరి!