లడ్డూ బాబూ.. కొబ్బరి బొండాం

రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘కొబ్బరిబొండాం’ సినిమా గుర్తుందా.? అందులో రాజేంద్రప్రసాద్‌ భారీకాయంతో కన్పిస్తాడు. బోల్డన్ని నవ్వులూ పూయించాడు ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్‌. ఇంచుమించు అలానే అల్లరి నరేష్‌ కూడా భారీ కాయంతో నవ్వించబోతున్నాడు. ‘లడ్డూబాబూ’…

రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘కొబ్బరిబొండాం’ సినిమా గుర్తుందా.? అందులో రాజేంద్రప్రసాద్‌ భారీకాయంతో కన్పిస్తాడు. బోల్డన్ని నవ్వులూ పూయించాడు ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్‌. ఇంచుమించు అలానే అల్లరి నరేష్‌ కూడా భారీ కాయంతో నవ్వించబోతున్నాడు. ‘లడ్డూబాబూ’ సినిమాతో అల్లరి నరేష్‌ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లడ్డూబాబూ’ ఫస్ట్‌ లుక్‌ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అల్లరి నరేష్‌, భారీ కాయంతో కన్పించాడు. అసలు అల్లరి నరేష్‌నేనా మనం చూస్తున్నది.? అన్పించింది. ఎక్కడా అల్లరి నరేష్‌ పోలికలే లేవు ఆ భారీ కాయంలో. ఈ మధ్యకాలంలో భారీకాయం అనే పదం ప్రస్తావించాలంటే చిన్న సినిమాల హీరో కృష్ణుడు అందరికీ గుర్తుకొస్తాడు. కృష్ణుడికి డబుల్‌ వున్నట్టున్నాడు అల్లరి నరేష్‌ ‘లడ్డూబాబూ’ సినిమాలో.

కావాల్సినంత అటెన్షన్‌ ప్రేక్షకుల నుంచి ‘లడ్డూబాబు’ ఫస్ట్‌ లుక్‌తో దర్శకుడు రవిబాబు, హీరో అల్లరి నరేష్‌ సంపాదించేశారు. సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమలో బోల్డంత చర్చ జరుగుతోందంటే వారి తొలి ప్రయత్నం సక్సెస్‌ అయినట్టే కదా.

అన్నట్టు, అందరికీ ఈ ఫొటో చూడగానే రాజేంద్రప్రసాద్‌ ‘కొబ్బరి బొండాం’ గుర్తుకొచ్చింది. మరి, ‘కొబ్బరిబొండాం’లో రాజేంద్రప్రసాద్‌లా అల్లరి నరేష్‌ ‘లడ్డూబాబూ’ అంటూ నవ్విస్తాడా.? వేచి చూడాల్సిందే.