మెగా ప్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ. ఇప్పుడు ఇతగాడంటే మిగిలిన మెగా హీరోలు, ముఖ్యంగా బన్నీ, రామ్ చరణ్ జెలస్ ఫీలవుతున్నారా? ఈ విధమైన గుసగుసలు వినిపిస్తున్నాయి కృష్ణానగర్ లో.
సినిమాను మెగా ఫ్యామిలీ జనాలు దాదాపు అందరూ చూసారట. నాగబాబు స్వయంగా బన్నీని, చరణ్ ను సినిమాకు కాస్త ఊపు ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. ట్వీట్ చేయమని, వీలైతే, టీవీల కు బైట్ లు ఇవ్వమని కొరినట్లు తెలిసింది. నాగ బాబు మాట మేరకు ఓ పెద్ద టీవీ చానెల్ ఈ ఇద్దరు టాప్ హీరోలను సంప్రదించగా వారు సున్నితంగా తప్పుకున్నట్లు కృష్ణనగర్ గుసగుసల్లో వినిపిస్తోంది.
ఈ సినిమా విషయంలో వాళ్లు కాస్త దూరంగానే వుంటూ వస్తున్నారని, ఇప్పుడు అది మరింత సష్టమైందని, మెగా హీరోలందరిలో వరుణ్ తేజ అందంగా వున్నాడని టాక్ రావడమే ఇందుకు కారణమంటున్నారు. దీంతో వారు జెలస్ ఫీలవుతున్నారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.