సౌఖ్యం సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరి మరో ప్రయత్నం ప్రారంభించారు. నిర్మాత కేఎస్ రామారావును ఓ సినిమాకు ఒప్పించాడు. మాంచి స్క్రిప్ట్ చెప్పి. అదే స్క్రిప్ట్ కు ఇద్దరు హీరోలు కావాలి. అందుకే తనకు అచ్చివచ్చిన సాయిధరమ్ తేజను, మరో హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ ను అనుకున్నాడు.
Advertisement
ఇటు మెగా, అటు నందమూరి అభిమానులు చూస్తే చాలు సినిమా సూపర్ హిట్ అయిపోతుందని ప్లాన్ అయి వుంటుంది. అయితే కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ విన్నారు కానీ, ఇంకా ఏ సంగతి చెప్పలేదు. కానీ ఈ ప్రాజెక్టు ఫైనల్ అవుతుందని కేఎస్ రవికుమార్ చౌదరి ఆశగా వున్నారు.