పాత సినిమాల్లో అయితే ఇప్పటికీ అలాంటి సీన్లు కనిపిస్తూ ఉంటాయి.. ప్రేమలో పడటం, తొందరపడి కాలు జారయేడం.. పెళ్లి చేసుకొందామని అమ్మాయి అడిగితే, అబ్బాయిలు మాత్రం మొహం చాటేస్తారు! కొన్ని వందల సినిమాల్లో ఇలాంటి సీన్లు కనిపిస్తూ ఉంటాయి. మరి అవంటే చాదస్తపు రోజులు.. అమ్మాయిలు పెళ్లి అంటే, అబ్బాయిలు మొహం చాటేయడం, తమ ప్రియురాళ్లను వదిలించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అందుకు పూర్తి విరుద్దమైన రోజులొచ్చినట్టున్నాయి. క్రికెటర్ విరాట్ కొహ్లీ, హీరోయిన్ అనుష్కా శర్మల లవ్ బ్రేకప్ కుసంబంధించి జరుగుతున్న ప్రచారమే దీనికి నిదర్శనం!
ఇన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ఇక పెళ్లి చేసుకుందాం.. అని విరాట్ ప్రతిపాదించాడని, అయితే పెళ్లికి అనుష్క ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని.. దీంతో వారిద్దరూ గొడవ పడి విడిపోయారని.. ఒక కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాయి బాలీవుడ్ వర్గాలు. 2016 సంవత్సరాంతానికి కళ్లా వివాహం చేసుకోవాలనేది విరాట్ ప్రతిపాదన. అయితే ఇప్పుడు అనుష్క అటు హీరోయిన్ గా , నిర్మాతగా బిజీగా ఉంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు లేదు.. విరాట్ మాత్రం ఇక పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు. దీంతోనే వారి మధ్య విబేధాలు రావడం.. ఇన్ స్టాగ్రమ్ లో విరాట్ అనుష్కను ఫాలో కావడం మానేయడం జరిగిపోయిందని.. వీరిని బాగా ఎరిగిన వాళ్లు చెబుతున్నారు. మరి ఇదే నిజం అయితే… పెళ్లి అంటే అబ్బాయిలు గాక అమ్మాయిలు మొహం చాటేసే రోజులు వచ్చేసినట్టేనేమో!
ఇన్ని రోజులూ ఎవరేం అనుకున్నా.. పట్టించుకోం అన్నట్టుగా తిరిగిన అనుష్క, విరాట్ లు ఈ బ్రేకప్ కహానీ గురించి ఏం చెబుతారో!