రకుల్ ప్రీత్ సింగ్..సునామీలా చుట్టేసింది టాలీవుడ్ ను. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ప్రారంభించి, టాప్ హీరోలందరితో చకచకా జోడీ కట్టి ఆడిపాడేసింది. ఇప్పుడు నాగ చైతన్య తో జోడీ కట్టబోతోందని వినికిడి. విజయాలు సాధిస్తున్న ఓ దర్శకుడు ఈ జోడీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చైతూ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. గౌతమ్ మీనన్ సినిమా దాదాపు పూర్తయింది. ఇక ప్రేమమ్ రీమేక్ మజ్ఞు చకచకా సాగిపోతోంది. ఇది కాగానే ఈ కొత్త కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం వుంది. చైతూ సరసన రకుల్ మంచి జోడీ అవుతుందని టాలీవుడ్ టాక్.
సమంత, కాజల్, తమన్నా లాంటి టాప్ హీరోయిన్ లతో నటించిన చైతూ ప్రస్తుతం గ్లామరస్ హీరోయిన్ శృతితో చేస్తున్నాడు. ఆ సినిమాలోనే మరో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. ఇక రకుల్ తో కూడా జోడీ కట్టేస్తే, దాదాపు అందరు టాప్ హీరోయిన్లతో నటించేసినట్లే.