కొన్నాళ్ల క్రితం ఒక వార్త కొన్ని ఫొటోలు గుప్పుమన్నాయి. హీరో బాలయ్య, డైరక్టర్ కృష్ణవంశీ కలిసి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను కలిసిన వార్త, అందుకు సంబంధించిన ఫొటోలు. బాలయ్య రైతు సినిమాలో నటించేందుకు అమితాబ్ ఓకె అన్నారని ప్రచారం. కానీ ఇప్పుడు చూస్తే, సీన్ రివర్స్ అయింది. అమితాబ్ తనకు ఖాళీ లేదన్నారని, వేరే కారణంతో, రైతు సినిమాలో రాష్ట్రపతి పాత్ర పోషించడానికి నిరాకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ కు బదులు నానా పటేకర్, నసీరుద్దీన్ షా లాంటి నటుల పేర్లు సూచించినా బాలయ్య నో అంటున్నారని లేటెస్ట్ ఖబర్.
అంటే ఇక్కడ రెండు పాయింట్లు క్లియర్ అయ్యాయి. ఒకటి అమితాబ్ తెలుగు సినిమాలో నటించేందుకు ఒకె అన్నారన్న వార్త అబద్ధం. రెండవది ఆ కారణంగా రైతు ప్రాజెక్టు అటకెక్కేసే ప్రమాదం ఏర్పడింది. అమితాబ్ లాంటి పెద్ద నటుడి విషయంలో ఓ తెలుగు దర్శకుడు, హీరో ఇలాంటి ప్రచారం ఎందుకు సాగించారన్నది క్వశ్చను. పూర్తిగా ఓకె అనకుండా ఎందుకు హడావుడి చేసినట్లు?
అమితాబ్ నో అన్నది అందుకేనా?
అసలు ఓ మంచి పాత్ర పోషించే అవకాశం వస్తే, అమితాబ్ ఎందుకు నో అన్నట్లు? బిజీగా వున్నారన్నది పూర్తి కారణం కాదు. ఎందుకంటే అమితాబ్ నే కావాలి అనుకుంటే, కృష్ణవంశీ-బాలయ్య కొన్నాళ్లు ఆగుతారు కదా? కొన్నాళ్లు ఆగమని చెప్పకుండా, పూర్తిగా నో చెప్పడం వెనుక వేరే రీజన్ వుందని తెలుస్తోంది. అమితాబ్ పేరు కాబోయే రాష్ట్రపతి రేస్ లో వుందని వినికిడి. అలాంటి టైమ్ లో సినిమాలో రాష్ట్రపతిగా నటించడం అంత బాగుండదని అమితాబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నో చెప్పారన్న టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి రైతు సినిమా బాలయ్య కు కాస్త ఎక్కువ డిస్కషన్లే తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఎలాగైనా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కృష్ణవంశీ కిందా మీదా అవుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది