కాటమ రాయుడు సినిమాకు రెండో డైరక్టర్ డాలీ. అంతకు ముందు దాన్ని ఎస్ జె సూర్య స్టార్ట్ చేసి తప్పుకున్నాడు. ఆకుల శివ అండ్ కో తయారుచేసిన ఆ స్క్రిప్ట్ ను డాలీ చేతిలోకి తీసుకున్నారు. ఆయన స్టయిల్ మార్పులు చేర్పులు చేసారని వినికిడి. అయితే ఇవేవీ పవర్ స్టార్ కు రుచించడం లేదని, దీనిపై నిత్యం డాలీకి టెన్షన్ గానే వుంటోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ మైండ్ ను, ఆలోచనలను సరిగ్గా రీడ్ చేయలేక, ఒకదానికి ఒకటి చేస్తూ, డాలీ ఇబ్బందులు పడుతున్నట్లు టాక్. సాధారణంగా పవన్ మనసులో ఏదో వుంటుంది. దాన్ని ఆయన కొంత మేరకు అలా అలా ఎక్స్ ప్లెయిన్ చేస్తారు. దాన్ని పట్టుకుని, మిగిలినది దర్శకుడు అల్లుకు రావాలి. ఇక్కడే తేడా వస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవన్ తన ఆలోచనలు అంత క్లారిటీగా చెప్పరని, తీరా ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఏదో ఒకటి చేసుకువస్తే, ఆయనకు ఓ పట్టాన నచ్చదని, ఇలాంటి పరిస్థితుల్లో డాలీ ఏదో విధంగా బండి నెట్టుకురావాలని ఎంత సర్దుకు పోతున్నా, రోజు రోజుకు సమస్య అధికం అవుతోంది తప్ప తగ్గడం లేదని టాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి.