మెగాభిమానులు ఈ సారి ఓకెనా?

మెగాస్టార్ ఫ్యామిలీ హీరోలకు వున్న బలం అభిమానులు. తొలి రోజు హంగామా, హడావుడి జరగాలంటే వారు పూనుకోవాల్సిందే. అందుకే కొత్త హీరో వచ్చినపుడల్లా, అభిమానుల సమావేశం పెడుతుంటారు. ఈ వ్వవహారాలన్నీ నాగబాబు చూస్తారు. ఇప్పుడు…

మెగాస్టార్ ఫ్యామిలీ హీరోలకు వున్న బలం అభిమానులు. తొలి రోజు హంగామా, హడావుడి జరగాలంటే వారు పూనుకోవాల్సిందే. అందుకే కొత్త హీరో వచ్చినపుడల్లా, అభిమానుల సమావేశం పెడుతుంటారు. ఈ వ్వవహారాలన్నీ నాగబాబు చూస్తారు. ఇప్పుడు ఆయన కుమారుడే హీరోగా వస్తున్నాడు. 

అందుకే నిన్నటికి నిన్నఎఫ్ఎన్ సిసి లో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులను పిలిచి భోజనాలు పెట్టారు. చిరంజీవి గారు వస్తున్నారు రండి అని పిలపించారు కానీ, ఆయన రాలేదు. నాగబాబే తన కుమారుడు..సినిమా వ్యవహారాలపై నాలుగు ముక్కలు మాట్లాడేసారు. ‘మేం చూసుకుంటాం సార్…’ అనేసారు  అభిమానులు.

అంతా బాగానే వుంది. కానీ అల్లు శిరీష్ ను పరిచయం చేసినపుడు ఇలాగే అన్నారు. కానీ మర్నాడు సరిగ్గా ధియేటర్ల దగ్గర బ్యానర్లు లేవు, జెండాలు లేవు. కానీ ఈ సారి అలా జరగదని అభిమానులే చెబుతున్నారు. ఎందుకంటే వాళ్లకి మెగాస్టార్ మీద ఎంత అభిమానం వుందో నాగబాబు మీద అంతకు అంతా వుంది. ఎందుకంటే ఆయనే కదా వాళ్లకి ఎప్పుడూ అందుబాటులో వుండేది.