Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమన్నాకు..దూరం దూరం?

తమన్నాకు..దూరం దూరం?

ఇప్పుడు సరైన చిన్న సినిమా పడాలే కానీ డబ్బులు బాగానే వస్తాయి. పైగా పెద్ద బ్యానర్లు చిన్న సినిమా తీస్తే, అది మరింత లాభదాయకం కూడా. అందుకే దిల్ రాజు, ప్రకాష్ రాజ్ కలిసి కృష్ణవంశీతో ఓ చిన్న సినిమా చేద్దామని డిసైడ్ అయిపోయారు. అంతవరకు బాగానే వుంది. కాస్త మంచి హీరోయిన్ కావాలని తమన్నాను అనుకున్నారు. ఆమె కూడా సరే అంది. 

కానీ ఎక్కడైనా హీరొయిన్ కానీ, పారితోషికం దగ్గర కాదు కదా? కోటికి పైసా తగ్గనుకాక తగ్గనంటోంది. మరి అప్పుడు అది చిన్న సినిమా ఎందుకవుతుంది. కృష్ణవంశీ ఇప్పుడు ఇంత కాస్ట్లీ హీరోయిన్ నాకు అనవసరం అంటున్నాడట. కొత్త అమ్మాయిని ఎవరినైనా అడిషన్ చేసి, తీసుకువచ్చి, నా సత్తా చూపిస్తా అంటున్నాడట. 

నిజానికి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.కృష్ణవంశీకి ఆ సత్తా వుంది. చార్మితో చేయలేదా..కాజల్ తో చేయలేదా..పోనీ లెండి ఈ రకంగానైనా మరో మాంచి కొత్త అమ్మాయి తెలుగుతెరకు పరిచయం అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?