బాలీవుడ్ లో టాప్ లెవెల్లో వుంది మన మల్లీశ్వరి కత్రినా కైఫ్. అందుకే ఏమైనా మాట్లాడే ధైర్యం వచ్చేసినట్లుంది. హీరోలనే మొహమాటం లేకుండా మనసులోని మాటలు నిర్మొహమాటంగా చెప్పేసింది. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో, తను హీరోలతో పడ్డ బాధలను కాస్తబోల్డ్ గానే చెప్పేసింది.
సెట్ కు వచ్చే ముందు హీరోలు కాస్త శుచీ శుభ్రం చూసుకోనక్కర్లేదా అన్న అర్థం వచ్చేలా మాట్లాడేసింది. రాత్రి ఫుల్ గా మందుకొట్టి, తెల్లవారి స్నానం చేయకుండా, వచ్చేసేవాళ్ల పక్కన రొమాన్స్ సీన్ చేయాలంటే ఎలా వుంటుంది..మీరే చెప్పండి అని అడిగేసింది. అసలు ఆ ఆలోచనే బాగుండదు. అందుకే నాకు ఆ సీన్లు చేస్తుంటే వాంతయినంత పనయ్యేది అంటోంది. కొంతమంది దగ్గరయితే ఒకటే చెమట వాసన. కానీ నటించాల్సిందే..ప్రేమ కనబర్చాల్సిందే..అని హీరోల ఇజ్జత్ తీసేసింది.
అయితే కత్రినా కైఫ్ మన వెంకీతో సహా చాలా మంది సరసన నటించింది. ఎవరు ఈ బాపతు హీరోలన్నది మాత్రం తెలియదు. అయితే అలా అని అనుమాన పడక్కర్లేకుండా, సౌత్ హీరోలు డీసెంట్ గా బిహేవ్ చేస్తారు అని ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. అందువల్ల మనవాళ్లు భుజాలు తడుముకోనక్కరలేదు. అదేదో బాలీవుడ్ బాబులు చూసుకుంటారు.