Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ కు ఓ డైరక్టర్ కుదిరాడు

రామ్ కు ఓ డైరక్టర్ కుదిరాడు

కథలో, చిత్రీకరణలో కాళ్లు వేళ్లు పెడతారు అనే బాపతు హీరోల్లో రామ్ కూడా వుంటడాని టాలీవుడ్ గుసగుస. పైగా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అందుకే సరైన డైరక్టర్ ఎవరూ అతగాడి దగ్గరకి వెళ్తున్నట్లు లేదు. దాంతో రామ్ నే వెదుక్కుంటున్నాడు. 

అతనికి ఇప్పుడు ఓ డైరక్టర్ దొరికాడు. ట్రయిలర్ చూసి, స్టామినా వుండే వుంటుందిలే అని డిసైడ్ అయి చాన్స్ ఇచ్చేసాడని వినికిడి. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తయారవుతున్న సినిమా పటాస్. దీనికి దర్శకుడు అనిల్ రావిపూడి. 

బేసిక్ గా అనిల్ రచయిత. అందుకే రామ్ తనే పిలిచి మాంచి లైన్ వుంటే చెప్పు, చేసేద్దాం అన్నాడని తెలుస్తోంది. పైగా ఇద్దరికీ పాత పరిచయాలు వున్నాయి. మసాలా సినిమాకు ఈయన హీరో, ఆయన రైటర్. అందుకే మనం మనం బరంపురం అనేసి ముందుగా రుమాలేసేసాడు రామ్. తప్పదు ఎవరి కెరీర్ వాళ్లు చూసుకోవాలి కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?