మెగాభిమానులకు యువన్ భయం

యువన్ శంకర్ రాజా..సంగీత దిగ్గజం ఇళయరాజా వారసుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు. కానీ ఎందుకనో తెలుగువారికి పెద్దగా నప్పలేదు. తెలుగులో హిట్స్ సంఖ్య చాలా తక్కువ. అందునా మెగాభిమానులకు మరీ చేదు…

యువన్ శంకర్ రాజా..సంగీత దిగ్గజం ఇళయరాజా వారసుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు. కానీ ఎందుకనో తెలుగువారికి పెద్దగా నప్పలేదు. తెలుగులో హిట్స్ సంఖ్య చాలా తక్కువ. అందునా మెగాభిమానులకు మరీ చేదు అనుభవాలున్నాయి. బన్నీకి హ్యాపీ, పవన్ కు పంజా అనే రెండు ఫ్లాపులు యువన్ సంగీతం అందించినవే. 

పైగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే తప్ప, తెలుగు నాట యువన్ కు మరో హిట్ మలేదు. అందుకే మెగా స్టార్ ఫ్యామిలీ అభిమానులు కాస్త భయపడుతున్నారు. ఈ రికార్డును తిరగరాసి, మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గోవిందుడుకి యువనే సంగీతం అందిస్తున్నాడు. కృష్ణ వంశీ సినిమాలంటే పాటలు సూపర్ గా వుంటాయి. 

ఇళయరాజా నుంచి నిన్న మొన్నటి రాథాకృష్ణన్ వరకు. కానీ రాథాకృష్ణన్ (చందమామ) తరువాత కృష్ణవంశీ మళ్లీ మంచి పాటలు అందించిన సినిమా సరైనది లేదు. తరుణ్ సినిమా శశిరేఖా పరిణయం తప్ప. సినిమా సినిమాకు ఆయన సంగీత దర్శకుడితో ప్రయోగాలు చేసకుంటూ పోతున్నారు. కానీ రాథాకృష్ణన్ అందించిన రేంజ్ లో మళ్లీ ఎవరూ పాటలు అందించలేదు. ఇప్పుడు గోవిందుడు పాటలు ఎలా వుంటాయో తెలియాలంటే మరో రోజు ఆగాలి. 15న ఈ అడియో విడదుల అవుతోంది.