ఆయన మెగాస్టార్. భయం అన్నది ఆయన డిక్షనరీలో లేదు. జనాలకు నచ్చుతుందనుకున్న సినిమా ఏది అయినా చేయడానికి రెడీగా వుంటారు. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు తాను మనసుపడిన సినిమా చేయడానికి మాత్రం ముందు వెనుక ఆడుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే మలయాళ సినిమా లూసిఫర్ ను ముచ్చటపడి తెలుగు హక్కులు కొనిపించారు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తో. ఆ సినిమాలో మోహన్ లాల్ చేసిన ఇంటెన్సివ్ క్యారెక్టర్ ను చేయాలని ఆయన సంకల్పం. స్క్రిప్ట్ డిస్కషన్లు, పనులు చాలా కాలం గా సాగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా వుంటుందా? వుండదా? అని గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి.
ఈ సినిమాలో చనిపోయే సిఎమ్ క్యారెక్టర్, మామ పోయాక ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునే సిఎమ్ అల్లుడు పాత్ర, సిఎమ్ కొడుకు క్యారెక్టర్లు, ప్రభుత్వాన్ని కాపాడే కీలక నాయకుడు క్యారెక్టర్ వున్నాయి. నిజానికి పోలిటికల్ డైలాగులు ఏవీ ఈ సినిమాలో వుండవు. కానీ స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎడ్జ్ మీద వెళ్లాలి. ఏమాత్రం అటు ఇటు అయినా వర్తమాన రాజకీయాలను, పార్టీలను, నాయకులను ఎక్కడ ఏమూల అయినా, ఏ మాత్రం అయినా టచ్ అయితే అనవసరపు తలకాయనొప్పులు వస్తాయి.
అసలే ఉభయరాష్ట్రాల రాజకీయాలు చాలా సెన్సిటివ్ గా వున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇలాంటి సినిమా చేయడం అవసరమా ? అన్న సలహాలు మెగాస్టార్ కు అందుతున్నాయని, దాంతో ఆయన ముందు వెనుక ఆడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఈ విధంగా మెగాస్టార్ ను వెనక్కు లాగుతున్నది డైరక్టర్ ఎవరో అన్న దాని మీద కూడా గుసగుసలు వినిపస్తున్నాయి.
నిజానికి లూసిఫర్ అన్నది మంచి సినిమా అని, ఈ విషయంలో మెగాస్టార్ ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.