షాడోతో పూర్తిగా భయపెట్టేశాడు మెహర్ రమేష్. నిర్మాతల్ని, హీరోల్ని… ఆఖరికి ప్రేక్షకుల్ని కూడా. షాడో తరవాత మెహర్‌తో సినిమా తీయడానికి నిర్మాతలెవరూ ముందుకు రారు అనుకొన్నారు. కానీ ఆశ్చర్యంగా అశ్వనీదత్ ఆ సాహసం చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానుంది. కథ కూడా రెడీ అయిపోయింది. ఆశ్వనీదత్ కూడా డబ్బులు పోగేశారు. కానీ.. సమస్య ఒక్కటే. హీరో ఎక్కడ??
అసలు ఈ ప్రాజెక్ట్ రవితేజ చేయాల్సింది. పాపం.. ఆయన కూడా వరుస ఫ్లాపుల మధ్య బలుపులాంటి ఓ యావరేజ్ వేసుకొని ఊపిరి పీల్చుకొంటున్నాడు. ఈ సమయంలో రవితేజ ఈ సాహసానికి ఒడిగట్టకపోవచ్చు. సునీల్ కూడా మెహర్‌తో సినిమా చేయడానికి తటపటాయిస్తున్నాట. దాంతో హీరోలకు కరవొచ్చింది.
మెహర్ అనగారు టెర్రరెత్తిపోతున్నారట. ఆయనకేమో స్టార్ హీరోలుంటే గానీ బండి నడవదు. అలాంటి హీరోలంతా మెహర్ ని చూసి సైడ్ అయిపోతున్నారు. పాపం.. ఎవరిని పట్టుకొంటాడో..? ఎలాంటి సినిమా తీస్తాడో..?