తెలుగు సినిమాలకే కాదు.. ఏకంగా చిత్ర పరిశ్రమకే కాజల్ దూరం అవుతుందా..? పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలనకొంటుందా?? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలుగు సినిమాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటోంది కాజల్. అయితే రెండు తమిళ సినిమాలు మాత్రం ఒప్పుకొంది. అజిత్, కార్తిలతో. ఆ సినిమాలు పూర్తయ్యాయి.
ఆ తరవాత తమిళంలో కొత్త సినిమాలపై సంతకాలు చేయలేదు. అంతేకాదు… పూర్తి చేసిన రెండు సినిమాల ప్రచారానికి రానని చెప్పిందట. దాంతో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. నువ్వు రాకపోతే ఎలా..? అని నిలదీస్తున్నారు. నేను రానంటే రాను – మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని మొండికేస్తోందట. తన కెరీర్‌పై ఇలాంటి నిర్ణయాలు ప్రభావం చూపిస్తాయి అని తెలిసినా.. కాజల్ ఇలా నిర్లక్ష్యంతో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సినిమాలకు దూరమవ్వాలనే నిర్ణయం తీసేసుకొందని, అందుకే ఇంత కరాఖండిగా ఉంటోందని చెబుతున్నారు. దానికి తగినట్టే చెల్లాయి నిషాకు పెళ్లి కుదిరిపోయింది. చెల్లె పెళ్లితో పాటు తాను కూడా పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడిపోతుందేమో..? అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటుందేమో..? ఈ సంగతులు కాజల్‌కే తెలియాలి.