మెహరీన్ నా? మజాకానా?

ఒక్క పూట ఫుడ్ బిల్లు 7,500..ఒక్క రోజు లాండ్రీ బిల్లు 27,000..స్వంత కాస్ట్యూమ్ డిజైనర్ బిల్లు అయిదు లక్షల నలభై వేలు…హీరోయిన్ దిగిన హోటల్ లో పక్క గదే కాస్ట్యూమ్ డిజైనర్ కు ఇవ్వాలి.…

ఒక్క పూట ఫుడ్ బిల్లు 7,500..ఒక్క రోజు లాండ్రీ బిల్లు 27,000..స్వంత కాస్ట్యూమ్ డిజైనర్ బిల్లు అయిదు లక్షల నలభై వేలు…హీరోయిన్ దిగిన హోటల్ లో పక్క గదే కాస్ట్యూమ్ డిజైనర్ కు ఇవ్వాలి. టోటల్ లాండ్రీ బిల్లు 1,37,000..టోటల్ ఫుడ్ బిల్లు…1,40,000..ఇవన్నీ రెమ్యూనిరేషన్ 65 లక్షలకు అదనం.

ఇదంతా హీరోయిన్ మెహరీన్ గురించి వినిపిస్తున్న వార్తలు. ఇటీవల ఓ వార్త వైరల్ అయింది. హీరోయిన్ మెహరీన్ హోటల్ బిల్లు ను అశ్వద్ధామ నిర్మాతలు కట్టకపోతే, ఆమె రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని. కానీ ఈ విషయం పై ఆరాతీస్తే కాస్త వింత వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాకు రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసి 10 లక్షలు వెనక్కు పెట్టారట నిర్మాతలు. ప్రమోషన్ అయ్యాక ఇస్తామని. కానీ ముందుగా అవసరం అంటే ముందే ఇచ్చేసారని బోగట్టా. కానీ ప్రమోషన్ కు ఏదో వంకన ఎగ్గొడుతుంటే, ఇలా అయితే ఈ ఖర్చంతా మాకెందుకు అని నిర్మాతలు ప్రశ్నించారని తెలుస్తోంది. దాంతో చెప్పా పెట్టకుండా రూములు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఆ టైమ్ లో హయాత్ హోటల్ దగ్గర ఐరా క్రియేషన్స్ కు గుడ్ విల్ పోకూడదని, మొత్తం బిల్లులు నిర్మాతలే పే చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు బిల్ పే చేసారన్న వార్తలను మెహరీన్ మేనేజర్ కూడా ధృవీకరించారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో నిర్మాతలు బిల్లు ఫే చేయలేదని ముందుగా ఎందుకు? ఎవరు లీకులు ఇచ్చారో తెలియదు. బహుశా ఇంత భారీబిల్లులు పే చేసి, తనపై ఏమైనా రివర్స్ లో గ్యాసిప్ లు వస్తాయేమో అని మెహరీన్ గ్యాసిప్ లీక్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.