మోసం చేసే సంస్థలకు మోడల్‌గా వుండటం ఇబ్బందే

వ్యాపారం అంటేనే ఎంతో కొంత లాభం కోసం చేసేది. లాభంలో ధర్మం ఎందుకు వుంటుంది.? మోసం చేస్తేనే కదా లాభపడేది. వ్యాపారం చేసేవాళ్ళు నూటికి తొంభై మంది సక్సెస్‌ అవుతారు. ఇవ్వాళ ధనికులంతా వ్యాపారం…

వ్యాపారం అంటేనే ఎంతో కొంత లాభం కోసం చేసేది. లాభంలో ధర్మం ఎందుకు వుంటుంది.? మోసం చేస్తేనే కదా లాభపడేది. వ్యాపారం చేసేవాళ్ళు నూటికి తొంభై మంది సక్సెస్‌ అవుతారు. ఇవ్వాళ ధనికులంతా వ్యాపారం చేసేవాళ్ళే కదా. అలాంటిది బంగారం వ్యాపారంలో మోసం జరగకుండా ఎలా వుంటుంది.? ఇటీవల కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ వాళ్ళు తూకంలోనూ, నాణ్యతలోనూ మోసం చేస్తున్నారనీ టీవీ5 ఆధారాలతో సహా బయటపెట్టింది. 

10 గ్రాములకుగాను ఒక గ్రాము తేడాతో విక్రయిస్తున్నట్లు రుజువు చేసింది. ఎన్నో మోసాల్లో ఇదొకటి.. అని తీసి పారెయ్యడానికి వీల్లేని విషయమిది. ఎందుకంటే కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌కు అక్కినేని నాగార్జున మోడల్‌గా వున్నాడు. ఆయన వల్లే ఆ సంస్థ ఎంతో ఉనికిలోకి వచ్చింది. ఇటీవల నాగార్జున చేసిన యాడ్‌లో తక్కువ ధరలకు, మన్నికైన బంగారం దొరుకుతుందనీ, ప్రతి నగలోనూ డిస్కౌంట్‌ వుందనీ, ఆ డిస్కౌంట్‌తోనే ఇంకో నగని ఈజీగా కొనెయ్యొచ్చనే అర్థం వచ్చేలా నటించాడాయన. 

ఇప్పుడు జరిగిన మోసంలో నాగార్జున ప్రమేయం లేనప్పటికీ, జెంటిల్‌మెన్‌ తరహాలో చేసిన ఆయన యాడ్స్‌కి జనం ప్రభావితం అయ్యారు కాబట్టి, ఆయన ప్రతిష్టకు మచ్చ తెచ్చేదే కదా. ఇందుకు షాపువాళ్ళే మూల్యం చెల్లించుకోక తప్పదు. మోసగాళ్ళను జనం పక్కన పెట్టేస్తారు కాబట్టి.