నవ మన్మధుడా.. అతి సుందరుడా…!

ఆడవాళ్ళల్లో రంభ, ఊర్వశి, మేనకల్లాగే మగవాళ్ళల్లో మన్మధుడు గొప్ప హ్యాండ్సమ్‌ అని చెబుతారు. ప్రతి అమ్మాయీ మన్మధుడ్నే కోరుకుంటుంది. తాను పిచ్చిమాతల్లిలా వున్నా సరే. మరి సెక్సీ హీరోయిన్‌ ఇలియానా  ప్రేమించిన ఆస్ట్రేలియా ఫొటోఆఫర్‌…

ఆడవాళ్ళల్లో రంభ, ఊర్వశి, మేనకల్లాగే మగవాళ్ళల్లో మన్మధుడు గొప్ప హ్యాండ్సమ్‌ అని చెబుతారు. ప్రతి అమ్మాయీ మన్మధుడ్నే కోరుకుంటుంది. తాను పిచ్చిమాతల్లిలా వున్నా సరే. మరి సెక్సీ హీరోయిన్‌ ఇలియానా  ప్రేమించిన ఆస్ట్రేలియా ఫొటోఆఫర్‌ ఆండ్రూ మాత్రం ఇలియానాకి మన్మధుడులా కనిపిస్తున్నాడట. ఆమె పేరెంట్స్‌కి మాత్రం ఇంకోలా కనిపిస్తున్నాడట. 

ఎందుకు తల్లీ.. మన దేశంలో ఎంతోమంది కుర్రాళ్ళు వుండగా పోయి పోయి ఆ విదేశీయుడిని తగులుకోవడం.? పైగా అతడేమన్నా గొప్పగా వున్నాడా.? రెండో పెళ్ళి వాడిలా కనిపిస్తున్నాడు.. అని తల్లిదండ్రులే కాదు, ఫ్రెండ్స్‌ కూడా మొత్తుకుంటున్నారట. అయినాసరే ఇలియానా ఆ గాఢత నుండి బయటపడలేకపోతుందట. ఇటు తెలుగులో అయితే సినిమాలే లేవు ఇలియానాకి. 

ఇంతవరకూ హీరోయిన్‌గా ఇది నా ల్యాండ్‌ మార్క్‌ సినిమా అనిచెప్పుకోవడానికీ ఆవిడకు గొప్ప సినిమా లేదు. ఇంకా ఎంతో సాధించాల్సి వుంది. ఇప్పుడే ప్రేమలో మునిగి తేలడమెందుకు.? అని విచారిస్తున్నారట. మరి ఆండ్రూ ఏం చేశాడోగానీ, నువ్వే నా ప్రాణం.. అని ఫిక్సయిపోయిందట ఇలియానా.