బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ సూత్రధారిగా అరెస్టు అయిన తర్వాత.. అక్కడ ఇప్పుడు పలువురు మోడల్స్ నోరు విప్పుతున్నారు. ఈ వ్యవహారం గతంలో దుమారం రేపిన మీ టూ తరహాలో మారడం గమనార్హం. మీ టూ వ్యవహారానికి ఇండియాలో ఆజ్యం పోసింది నటి తనూశ్రీ దత్తా.
అమెరికాలో సెటిలైన ఆమె ఆశ్చర్యకరమైన లుక్ లో ఇండియాకు వచ్చి, తన గతానుభవాల గురించి మాట్లాడింది. అక్కడ నుంచి ఇండియాలో మీ టూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మీ టూ ఉద్యమంలో పలువురు మేల్ సెలబ్రిటీలు ఇబ్బందులు పడ్డారు. ఏకంగా నాటి కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ కూడా పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన అడ్రస్ లేదిప్పుడు.
ఇక ఇప్పుడు పోర్న్ రాకెట్ ఒకటి బయటపడిన నేపథ్యంలో.. ఈ తరహా ఫిల్మ్ లు తీసిన ఇతరుల గురించి కూడా చర్చ మొదలైంది. తమను ఆడిషన్స్ కు అంటూ పిలిచి, ఈ తరహాలో నటించమన్నారని, టెస్టింగ్ అంటూ బట్టలు విప్పమన్నారంటూ.. పలువురు మోడల్స్ ఇప్పుడు స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు. వీరిలో కొందరు ఆ నిర్మాతల, దర్శకుల పేర్లు చెబుతున్నారు. మరి కొందరు వాళ్ల పూర్తి పేర్లు తమకు తెలియవని అంటున్నారు. బ్యానర్ల పేర్లు చెబుతున్నారు.
ఆడిషన్స్ కు వెళ్లిన సమయంలో తమను నగ్నంగా మారమనడం, ఎరోటిక్ సీన్లను చేయమనడం.. వంటి సూచనలు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు మోడల్స్. వీరిలో కొందరు రాజ్ కుంద్రాతో తమకు ఎదురైన అనుభవాలను కూడా చెబుతున్నారు. మరి కొందరు ఈ తరహా ఫిల్మ్ లు తీసే వేరే బ్యానర్ల, యాప్ ల పేర్లను చెబుతున్నారు.
తాము సెట్టింగ్స్ కు వెళ్లే సమయానికే అక్కడ లెస్బియన్ తరహా రొమాన్స్ వీడియోలను చిత్రీకరించే వారని ఒక మోడల్ చెప్పింది. అదేదో యాప్ పేరు చెప్పి.. ఆ యాప్ లో విడుదలయ్యే సినిమాల్లో నటించడానికి తనను ఆడిషన్స్ కు పిలిచారని ఆమె చెబుతోంది. ఆడిషన్స్ లో భాగంగా తనను న్యూడ్ మారమన్నారని ఆమె చెప్పింది. అయితే వారి ప్రతిపాదనకు తను తలొగ్గలేదని.. ఆమె వివరించింది.
పోర్న్ వల్ల అంతిమంగా దారి తీసేది విమెన్ ట్రాఫికింగ్ కే అని వేరే చెప్పనక్కర్లేదు. సెమీ పోర్న్ వల్ల కూడా అలాంటి పరిణామాలు తలెత్తవచ్చు. ఈ వ్యవహారాల్లో బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటి కోణాలపై పోలీసులు దృష్టి సారించాల్సి ఉంది. ఇదే సమయంలో కొందరు నటీమణులు, మోడల్స్.. ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం విడ్డూరం.
రాజ్ కుంద్రా వ్యవహారంలోనే.. నటి షెర్లిన్ చోప్రా లాంటి వాళ్లు తమకే పాపం తెలియదని, అంతా కుంద్రానే అని స్టేట్ మెంట్లు ఇచ్చారట. అయితే వాళ్లు సోషల్ మీడియాలోనే బోలెడన్ని బోల్డ్ ఫొటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో.. వాళ్లు వేరే వాళ్లు చెబితే నగ్నంగా నటించేంత అమాయకులా? అనే ప్రశ్న తలెత్తుతోంది.