ఇప్పుడంటే మూడు ముళ్లు పడిపోయి మొగుడు పెళ్లాలైపోయారు కానీ జెడీ చక్రవర్తి-అనుకృతి శర్మ మొన్నటి వరకు ఒకరు హీరోయిన్ మరొకరు డైరక్టర్ కమ్ హీరో. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా శ్రీదేవి. అదే నండీ రామ్ గోపాల్ వర్మ సావిత్రి పేరుతో ప్రారంభించి, ఆపై శ్రీదేవి అని పేరు మార్చిన సినిమా.
ఈ సినిమా పేరుకి రామ్ గోపాల్ వర్మదే అయినా డైరక్ట్ చేసింది అంతా జేడీ చక్రవర్తేనట. అసలు ఈ సినిమాలోకి అనుకృతి రావడమే చిత్రంగా జరిగిందని వినికిడి. ఓ నిర్మాతతో కలిసి అనుకృతి ఓ పార్టీకి వచ్చిందట. ఆమెను చూసిన వర్మ, ఎవరు ను అడిగి, తెలుసుకుని, తాను ఓ సబ్జెక్ట్ అనుకుంటున్నానని, దానికి ఆమె పెర్ ఫెక్ట్ గా సరిపోతుందని, మర్నాడు తన ఆఫీస్ కు రమ్మని ఆహ్వానించాడట. అలా సావిత్రి/శ్రీదేవి ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయింది అనుకృతి.
అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆ సినిమాలో జెడీ కూడా కీలకపాత్రలో నటించాడు. సినిమాలో జేడీ, అనుకృతిలపై ఓ లిప్ టు లిప్ కిస్ సీన్ వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ సీన్ అసలు ఇలా అలా కాదు, ఓ రేంజ్ లో చిత్రీకరించారట. అనుకృతి పెదాలను జేడీ ఓ రేంజ్ లో చప్పరించేసాడని బోగట్టా. కాస్త లెంగ్తీ అయిన ఆ కిస్సింగ్ సీన్ చూసే భాగ్యం జనానికి ఎప్పుడు కలుగుతుందో? ఆ సినిమా పూర్తయిపోయింది కానీ, మరి రామ్ గోపాల్ వర్మ ఎందుకునో రిలీజ్ చేయడం లేదు.
అయితే ఇప్పుడు చిన్న అనుమానం మొన్నటి వరకు అంటే వేరు. ఇప్పుడు జెడీ అనుకృతి జంటగా మారారు కాబట్టి, ఈ లిప్ టు లిప్ కిస్ సీన్ ను సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని వుంచుతారో? లేదూ పెళ్లయిపోయింది కాబట్టి అంత బాగోదని తీసేస్తారో?