సోగ్గాడే చిన్ని నాయనా అంటూ టైటిల్ సాంగ్ కు చిందులేసింది యాంకర్ అనసూయ కొన్నేళ్ల క్రితం. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా బంగార్రాజు సినిమా స్టార్ట్ అవుతుంది.
ఈనెల 20 న ప్రారంభించి సంక్రాంతి బరిలోకి దింపాలన్నది సంకల్పం. ఇప్పటికే ఈ సినిమాకు లీడ్ పెయిర్లుగా నాగ్-రమ్యకృష్ణ, నాగ్ చైతన్య-కృతిశెట్టి లు ఫిక్స్ అయ్యారు.
అయితే అనసూయ మళ్లీ కనిపిస్తుందా? అంటే ఆ సంగతి ప్రస్తుతానికి తెలియదు కానీ, సినిమాలో మోనాల్ గుజ్జర్ మాత్రం ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది.
ఇది కేవలం పాటకు పరిమితం అయ్యే పాత్ర కాదు. కాస్త నిడివి వున్న పాత్రే. బిగ్ బాస్ సీజన్ 4 తరువాత నుంచి మోనాల్ తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 టైమ్ లో నాగ్ అభిమానం కూడా చూరకొంది.
ఇప్పుడు ఏకంగా నాగ్ సినిమాలోనే చాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ తరువాత స్పెషల్ సాంగ్ లు మాత్రమే మోనాల్ ను వెదుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది. దీని సాయంతో ఇక దూసుకుపోతుందేమో చూడాలి.