మూడో రోజూ రంగస్థలం బీభత్సం

దాదాపు ఆరు నెలలుగా తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న భారీ సినిమా దాహం తీరిపోయింది. రంగస్థలం రూపంలో సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సినిమా వచ్చింది. చానాళ్లయింది థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్ ల…

దాదాపు ఆరు నెలలుగా తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న భారీ సినిమా దాహం తీరిపోయింది. రంగస్థలం రూపంలో సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సినిమా వచ్చింది. చానాళ్లయింది థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్ ల అమ్మకాలు చూసి. ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ భయంకరంగా పే చేస్తోంది రంగస్థలం. మెగా వైభవం మాయమవుతోందన్న ప్రచారం నడుమ ఈ సినిమా రావడం మెగాభిమానులకను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

బాహుబలి తరువాతి స్థానం ఇటు డొమెస్టిక్ మార్కెట్ లో అటు విదేశీ మార్కెట్ లో దక్కించుకునే దిశగా రంగస్థలం ముందుకు వెళ్తోంది. ధర్టీ ప్లస్ వాళ్లందరికీ, ముఖ్యంగా పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చిన వారందరికీ సినిమా ఓ నోస్టాల్జియాలా వుంది. పైగా సరైన టైమ్ కూడా సెట్ అయింది. ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత సరైన రిలీఫ్ మాదిరిగా వుంది. దాంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

ఎన్టీఆర్ ట్వీట్లే ట్వీట్లు

రంగస్థలం చూసిన యంగ్ టైగర్ వరుస ట్వీట్ లు చేయడం విశేషం. వరుసగా చేసిన మూడు ట్వీట్ ల్లో సుకుమార్, డీఎస్పీ, రామ్ చరణ్, సమంత, ఇలా పేరు పేరునా ప్రశంసల్లో ముంచెత్తారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రతి ఒక్కరు కలిస్తే తప్ప, ఇలాంటి ఎక్సెలెంట్ ప్రొడెక్ట్ బయటకు రాదని, సుకుమార్ విజన్ కు అభినందనలు అని ఎన్టీఆర్ పేర్కొనడం విశేషం. రామ్ చరణ్ తప్ప ఇంకెవ్వరూ ఇంతకన్నా బెటర్ గా చేయలేరని ఎన్టీఆర్ పేర్కోనడం విశేషం.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. జై లవకుశ హిట్ అయిన తరువాత రామ్ చరణ్ దంపతులు, ఎన్టీఆర్ దంపతులను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ అభినందనలతో ముంచెత్తారు. ఈ ఇద్దరు కలిసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.