మొత్తానికి శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ నెల 6నుంచి విశాఖలో షూట్ ప్రారంభమవుతుంది. ఓ వారం అక్కడ షెడ్యూలు చేసి, కాకినాడకు షిఫ్ట్ చేస్తారు. కాకినాడలో పూర్తి చేసుకున్న తరువాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ వేసిన సెట్ లో కంటిన్యూ చేస్తారు.
శర్వానంద్ ఈ సినిమాలో రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. నడివయసు మాఫియా డాన్ గా, యువకుడిగా ఇలా రెండు రకాలుగా కనిపిస్తాడు. చాలా సినిమాల్లో చూసినట్లే, పోర్టు కార్మికుల బాధలు చూసి, సహించలేక, వారి కోసం పోరాడి నాయకుడిగా ఎదగడం కాన్సెప్ట్ గా తెలుస్తోంది. అందుకే విశాఖ పోర్టు, కాకినాడ పోర్టు నేపథ్యాల కోసం అక్కడ షూటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు శర్వా మార్కెట్ తో పోల్చుకుంటే కాస్త ఎక్కువే బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు. ఇరవై కోట్లకు పైగా బడ్జెట్ ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ ఇంతకు ముందు సినిమా కేశవ ఏవరేజ్ గా మిగిలింది. అంతకు ముందు దోచేయ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు శర్వానంద్ నమ్మిన స్క్రిప్ట్ నే ఈ సినిమాకు కీలక పుల్లింగ్ ఫ్యాక్టర్.