ఛల్ త్రివిక్రమ్ రంగ

ఛల్ మోహన్ రంగ సినిమా సెన్సార్ కు రెడీ అయిపోయింది. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, పవన్ సమర్పకుడు. కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా…

ఛల్ మోహన్ రంగ సినిమా సెన్సార్ కు రెడీ అయిపోయింది. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, పవన్ సమర్పకుడు. కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ట్రయిలర్ లోనే పడిన రెండు మూడు డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గుర్తుకు తెచ్చాయి. సినిమాలో ఇది మరి కాస్త ఎక్కువే వున్నట్లు  వినిపిస్తున్న టాక్ చెబుతోంది.

సినిమాలో డైలాగ్ కామెడీ ఎక్కువగా వుందని, ఆ ప్రాసలు, ఆ పంచ్ లు త్రివిక్రమ్ స్టయిల్ ను గుర్తుకు తెస్తాయని వినిపిస్తోంది. త్రివిక్రమ్ లవ్ సబ్జెక్ట్ ను డీల్ చేసి చాలా కాలమైంది. అ..ఆ సినిమాలో ప్రేమ కన్నా పట్టింపులు ఎక్కువగా కనిపిస్తాయి. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందు కన్నా, రచయితగా వున్నపుడే యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ లు ఎక్కువగా అందించారు. మళ్లీ ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణ చైతన్యకు అలాంటి లైన్ ను త్రివిక్రమ్ అందించి డెవలప్ చేయించినట్లు తెలుస్తోంది.

అందువల్ల ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పూరిత భావోద్వేగాలు, కాస్త ఆ తరహా డైలాగులు కాస్త ఎక్కువే వున్నాయని వినికిడి. అజ్ఞాతవాసి తెచ్చిన బ్యాడ్ నేమ్ ను త్రివిక్రమ్ కు ఈ సినిమా కాస్తయినా తగ్గిస్తుందేమో చూడాలి. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత కూడా దర్శకుడు కృష్ణ చైతన్య మరో సినిమాను నితిన్ హోమ్ బ్యానర్ లోనే చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.