వివి వినాయక్ కథను వండడం ప్రారంభించారు. నిర్మాత సి కళ్యాణ్ కొత్త ఆఫీసు తీసారు. బాలయ్యతో సినిమా కోసం ఓ లైన్ అనుకున్నారు. కథ తయారైతే, అది బాగుంటే బాలయ్యను ఒప్పించడం కష్టం కాదు.
కానీ కథ తయారుకావాలి. ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయ్యేలోగా మాంచి కథ రెడీ చేయాలన్నది ఆలోచన. అందుకే ఇప్పటి నుంచీ కసరత్తు ప్రారంభించేసారు.
ఇదిలా వుంటే బాలయ్య కోసం వినాయక్ ఆలోచించిన లైన్ సర్కార్ లో అమితాబ్ క్యార్యెక్టర్ లా వుంటుందని తెలుస్తోంది. సినిమాలో ఆద్యంతం బాలయ్య పంచెకట్టుతో వుండేలా క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నారని వినికిడి.
వాస్తవానికి ఈ క్యారెక్టర్ కు సర్కార్ లో అమితాబ్ లా నల్లరంగు పంచె కట్టాలన్నది ఓ ఆలోచన. కానీ అలా కన్నా తెల్లరంగే బాగుంటుందని, తెలుగువారి పంచెకట్టు అంటే తెలుపుకదా అన్నది మరో ఆలోచన.
ఇదంతా ఇంకా ప్రిలిమనరీ స్టేజ్. కథ రెడీ కావడానికి, బాలయ్య ఓకె అనడానికి మధ్య కనీసం నాలుగైదు నెలలు టైమ్ వుంది. అప్పటికి మరి కాస్త క్లారిటీ వస్తుందేమో?