cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

మూడోవారంలో 'వినయ' ఫంక్షన్

మూడోవారంలో 'వినయ' ఫంక్షన్

సంక్రాంతి సినిమాల ప్రచారం సందడి స్టార్ట్ అవుతోంది. లుక్ లు, టీజర్ లు, సాంగ్ లు, ట్రయిలర్లు రెడీ అవుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయా సినిమాల అభిమానులను అలరించేందుకు పబ్లిసిటీ మెటీరియల్ బయటకు రాబోతోంది. అలాగే జనవరి మూడోవారంలో విడుదలయ్యే మిస్టర్ మజ్ఞు టీజర్ కూడా రాబోతోంది.

ఇదిలా వుంటే సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్-బోయపాటిల వినయ విధేయ రామ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డిసెంబర్ మూడోవారంలో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి డిసెంబర్ 27ను డేట్ గా అనుకుంటున్నారు. వెన్యూ ఇతరత్రా వ్యవహారాలు ఫైనల్ కావాల్సి వుంది.

ఎఫ్ 2 ఫంక్షన్ ఇంకా డిసైడ్ కాలేదు. అది కూడా కాస్త ముందుగా వెనుగా అదే డేట్ కు వుంటుంది. ఇప్పటికే ఎఫ్ 2, వినయ సినిమాలకు థియేటర్లు అన్నీ అగ్రిమెంట్లు పూర్తి చేసేసారు. అందువల్ల సంక్రాంతికి రావు అన్న అనుమానం అయితే లేదు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్