మెగాస్టార్-యువి నిర్మించే సినిమా మీద మంచి మంచి వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు వశిష్ట గతంలో రూపొందించిన బింబిసార సినిమా మాదిరిగానే ఇది కూడా ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ నే. ఈ సినిమాలో మూడు లోకాల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. అందువల్ల కాస్త ఎక్కువ మందే హీరోయిన్లు అవసరం పడతారని తెలుస్తోంది. అందరూ మెయిన్ హీరోయిన్లే కాకపోయినా, కాస్త ప్రామినెంట్ హీరోయిన్లనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఓ హీరోయిన్ గా అనుష్క వుండొచ్చుని వార్తలు వినిపించడం ప్రారంభమైంది. మరో హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ అయితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారట.
అలాగే ఐశ్వర్య రాయ్ ను కూడా ఓ కీలకపాత్రకు అడగాలని చూస్తున్నారు. ఇవన్నీ ఇంకా ఫైనల్ డెసిషన్ కు రావాల్సి వుంది. కథ హీరోయిన్లు అందరికీ చెప్పాలి, వారు ఓకె అనాలి, డేట్ లు, రెమ్యూనిరేషన్ సెట్ కావాలి. ఇలా చాలా వుంది వ్యవహారం.
యువి విక్రమ్, రామ్ చరణ్ కలిసి ఈ సినిమాను కాస్త భారీ బడ్జెట్ తోనే నిర్మించబోతున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. భోళాశంకర్ తరువాత మెగాస్టార్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.